అంతర్జాతీయ విమానాల రద్దు అక్టోబరు 31 వరకు పొడిగింపు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:07 IST

అంతర్జాతీయ విమానాల రద్దు అక్టోబరు 31 వరకు పొడిగింపు

దిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై విధించిన రద్దు గడువును అక్టోబర్‌ 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) కార్యాలయం మంగళవారం వెల్లడించింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నతాధికార వర్గాలు ఎంపిక చేసిన మార్గాల్లో మటుకు విమానాలు యథాతథంగా నడుస్తాయని తెలిపింది. దేశంలో ఈ మహమ్మారి విజృంభణ మొదలయ్యాక గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాల రద్దు కొనసాగుతోంది. అదే ఏడాది మే నెల నుంచి ‘వందేభారత్‌’ మిషన్‌ కింద ప్రత్యేక విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన