తండ్రి బాధ్యత అంతటితో తీరిపోదు

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

తండ్రి బాధ్యత అంతటితో తీరిపోదు

చదువుకయ్యే ఖర్చును భరించాల్సిందే: దిల్లీ హైకోర్టు

దిల్లీ: తనయుడికి 18 ఏళ్లు నిండి మైనారిటీ తీరిపోయినంత మాత్రాన అతని చదువుకయ్యే ఖర్చు బాధ్యత నుంచి తండ్రి తప్పించుకోలేరని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పిల్లలు తమను తాము పోషించుకునేలా సమాజంలో ఒక స్థాయికి ఎదిగే వరకు ఆర్థిక భారాన్ని తండ్రే మోయాలని స్పష్టం చేసింది. కుమారుడికి మైనారిటీ తీరిందని మొత్తం భారాన్ని తల్లిపైనే మోపడం తగదని జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ ధర్మాసనం పేర్కొంది. కుమారుడి గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయ్యేవరకు, లేదా ఉద్యోగం సంపాదించే వరకు తన భార్యకు తాను రూ.15,000 చొప్పున నెలవారీ తాత్కాలిక మనోవర్తి చెల్లించాలని ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. పిల్లలపై ఖర్చులు పోగా ఇక తల్లికి మిగిలేదేమీ ఉండదనీ, అందువల్ల తాత్కాలిక మనోవర్తిని చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. సామాజిక, సాంస్కృతిక అవరోధాల వల్ల చాలా ఇళ్లలో స్త్రీలు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదని పేర్కొంది. మహిళలు ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్న ఇళ్లలోనూ పిల్లల పోషణ బాధ్యతను పురుషులు తప్పించుకోలేరని న్యాయమూర్తి చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన