close

ప్రధానాంశాలు

Updated : 04/05/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాపై మరో ఉగ్రదాడిని జరగనివ్వం

బిన్‌ లాడెన్‌ను హతమార్చి 10ఏళ్లు పూర్తయిన సందర్భంగా జో బైడెన్‌

వాషింగ్టన్‌: ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా కట్టుబడి ఉందని, పట్టుసడలించకుండా దానిపై పోరును కొనసాగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. మరోసారి అమెరికాపై ఉగ్రదాడి జరగనివ్వబోమని, దేశ ప్రజలను సురక్షితంగా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో తలదాచుకున్న అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా ప్రత్యేక దళాలు హతమార్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌పై 2001 సెప్టెంబరు 11న దాడులకు కుట్రపన్నిన అల్‌ఖైదాను నిర్మూలించే చర్యల్లో భాగంగా బిల్‌ లాడెన్‌ను అంతమొందించేందుకు అమెరికా ప్రత్యేక దళాన్ని రంగంలోకి దించింది. 2011 మే 1న అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఉపాధ్యక్షుడిగా ఉన్న బైడెన్‌ శ్వేతసౌధంలోని ప్రత్యేక గది నుంచి లాడెన్‌పై మెరుపు దాడిని నేరుగా పర్యవేక్షించారు. ఆదివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో బైడెన్‌ మాట్లాడుతూ...‘లాడెన్‌ స్థావరంపై అమెరికన్‌ సీల్స్‌ దాడిని ఎన్నటికీ మరువలేను’ అని పేర్కొన్నారు. సైనికుల సాహసం, నైపుణ్యాలను ప్రశంసించారు. 9/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మన ప్రియతములకు న్యాయంచేకూర్చి వాగ్దానాన్ని నిలుపుకున్నాం అని బైడెన్‌ తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన