close

తాజా వార్తలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ పథకాల పొడిగింపు

ఏలూరు సాంస్కృతిక, న్యూస్‌టుడే: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ సెల్‌ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన ప్రతిభ ప్లస్‌, ఎస్‌టీవీ-141 పథకాలను పొడిగించిందని జీఎం కేఎస్‌ వరప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


రూ.49ల ప్రతిభ ప్లస్‌ పథకంలో 10 రోజులు భారతదేశం మొత్తం అన్ని నెట్‌వర్కులకు (దిల్లీ, ముంబయి తప్ప) అపరిమిత ఉచిత కాలింగ్‌, 200 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1 జీబీ ఉచిత డేటా పొందవచ్చని తెలిపారు. తదుపరి కాల్‌ ఛార్జీలు దేశం మొత్తం అన్ని నెట్‌వర్కులకు రోమింగ్‌ సహా ప్రతి సెకనుకు ఒక పైసా అవుతుందన్నారు. పథకం కాలపరిమితి 180 రోజులు.

బీఎస్‌టీవీ-141లో రూ.141లకే 28 రోజులు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్కులకు అపరిమిత ఉచిత కాలింగ్‌ (రోమింగ్‌లో కూడా దిల్లీ, ముంబయి మినహా) పొందవచ్చని తెలిపారు. ఇంకా 10 జీబీ అధిక వేగం డేటా, రోజుకు 50 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చన్నారు. ఈ అవకాశం పరిమిత కాలం మాత్రమే ఉంటుందని తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.