Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 103728
            [news_title_telugu_html] => 

స్పైస్‌జెట్‌ ఖాతాలో వందో విమానం

[news_title_telugu] => స్పైస్‌జెట్‌ ఖాతాలో వందో విమానం [news_title_english] => Spicejet adds 100th plane to fleet 4th domestic airline to do Mumbai [news_short_description] => ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ మరో విమానం బోయింగ్‌ 737ని  ప్రవేశపెట్టింది. దీంతో మొత్తం 100 విమానాలు కలిగిన నాలుగో దేశీయ విమానయాన సంస్థగా స్పైస్‌జెట్‌ అవతరించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, రుణసంక్షోభంలో... [news_tags_keywords] => Spicejet,Domestic Airlines [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-27 00:48:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
స్పైస్‌జెట్‌ ఖాతాలో వందో విమానం - Spicejet adds 100th plane to fleet 4th domestic airline to do Mumbai - EENADU
close

తాజా వార్తలు

స్పైస్‌జెట్‌ ఖాతాలో వందో విమానం

వంద విమానాలు కలిగిన నాలుగో దేశీయ సంస్థగా గుర్తింపు

దిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ వందో విమానం బోయింగ్‌ 737ని ప్రవేశపెట్టింది. దీంతో మొత్తం 100 విమానాలు కలిగిన నాలుగో దేశీయ విమానయాన సంస్థగా స్పైస్‌జెట్‌ అవతరించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా, రుణసంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కేవలం ఏప్రిల్‌ నెలలోనే 23 కొత్త విమానాలను తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 2014లో మూతపడే దశలో ఉన్న స్పైస్‌జెట్ సంస్థ 2019లో ఎవరూ ఊహించని విధంగా 100 విమానాలను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌ వద్ద 68 బోయింగ్‌ 737 విమానాలు, 30 బంబార్డియర్‌  Q-400, రెండు బోయింగ్‌ ఫ్రైటర్స్ ఉన్నాయి. ‌సగటున ప్రతిరోజు దాదాపు 62 గమ్యస్థానలకు సర్వీసులు నిర్వహిస్తున్న స్పైస్‌జెట్‌ 575 విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీయ విమానయాన సంస్థలైన ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌, గోఎయిర్‌, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా, ఎయిర్‌ ఏషియా, అలియాన్స్ పరిధిలో మొత్తం 595 విమానాలు సేవలు అందిస్తున్నాయి. ‌వీటిలో ఇండిగోకు చెందినవి 230, ఎయిర్‌ ఇండియావి 128, స్పైస్‌జెట్‌ సంస్థకు చెందినవి 100 విమానాలు ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.