close

తాజా వార్తలు

అదిరిపోయే ఫీచర్లతో ఆసుస్‌ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌

బడ్జెట్‌ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు తీసుకొస్తున్న మొబైల్‌ తయారీ కంపెనీలు.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై కన్నేశాయి. యువతను ఆకట్టుకునేందుకు వేగంతో పాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్‌ తయారీదారు ఆసుస్‌ ఓ కొత్త ఫ్లాగషిప్‌ ఫోన్‌ను భారత్‌కు తీసుకొచ్చింది. దీనికి ఆసుస్‌ 6Z అని పేరుపెట్టింది. వాస్తవానికి జెన్‌ఫోన్‌ 6 పేరిట ఇదివరకే ఈ ఫోన్‌ను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేసిన కంపెనీ.. ‘జెన్‌ఫోన్‌’ ట్రేడ్‌మార్క్‌ విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలో 6Z పేరిట ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. మరి ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌పై ఓ లుక్కేద్దామా!
వివాదం ఏంటి: ఆసుస్‌ ఫోన్లలో ఇకపై ఆ పదం కనిపించదు!

ఫ్లిప్‌ కెమెరా
ఆసుస్‌ 6Z విషయంలో ముందు చెప్పుకోవాల్సింది... కెమెరా గురించి. ఇది అటు ఫ్రంట్‌ కెమెరాగానూ.. బ్యాక్‌ కెమెరాగానూ మనకు పనిచేస్తుంది. 48 మెగాపిక్సల్‌ సోనీ IMX 586 సెన్సార్‌తో వస్తోంది. డ్యూయల్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌ ఉంటుంది. దీంతోపాటు 13 మెగాపిక్సల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా కూడా ఉంటుంది. ఇందులో సూపర్‌ నైట్‌మోడ్‌ను కంపెనీ అందిస్తోంది. ఒకవేళ ఫోన్‌ ఫ్లిప్‌ ఆన్‌లో ఉండగా.. చేతి నుంచి ఫోన్‌ చేజారినా విరిగిపోకుండా ఫ్లిప్‌ కెమెరా దానంతట అదే క్లోజ్‌ అవుతుంది.

పనోరమా ఫొటోలు

ఫ్రంట్‌ కెమెరా ఎలాగూ వెనుక భాగంలో ఉంటుంది కాబట్టి డిస్‌ప్లేపై ఎలాంటి నాచ్‌ ఉండదు. మరోవైపు ఫ్లిప్‌ కెమెరా వల్ల పనోరమా ఫొటోలు సులభంగా, చక్కగా తీసుకోవచ్చు. పనోరమా మోడ్‌లోకి వెళ్లగానే కెమెరా ఆటోమేటిక్‌గా మూవ్‌ అవుతూ, సెల్ఫీ మోడ్‌లోకి వచ్చేస్తుంది. దీంతో సెల్ఫీ + పనోరమా ఫొటోలు తీసుకోవచ్చు. దీంతోపాటు ఇందులో 480 ఎఫ్‌పీఎస్‌ స్లోమోషన్‌ వీడియో రికార్డింగ్‌, ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలేజేషన్‌తో 4కె వీడియోలు చిత్రీకరించొచ్చు. 

ఇతర స్పెసిఫికేషన్స్‌..
ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ సరికొత్త ఫ్లాగ్‌షిప్‌ 855 ప్రాసెసర్‌ను వాడారు. 5000mAh బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ పై ఓఎస్‌ ఆధారిత జెన్‌ యూఐ6తో ఈ ఫోన్‌ వస్తోంది. తదుపరి ఆండ్రాయిడ్‌ వెర్షన్లు Q, R (అందుబాటులోకి వచ్చాక) అందిస్తామని కంపెనీ పేర్కొంది. ఇందులో  19.5:9 యాస్పెక్ట్‌ రేషియోలో 6.4 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ +డిస్‌ప్లే వస్తోంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటక్షన్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా 2టీబీ వరకు పెంచుకునే వీలుంది. దీంతో పాటు వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ ఉంటుంది. గూగుల్‌ అసిస్టెంట్‌, డీఎన్‌డీ, సౌండ్‌ ప్రొఫైల్‌ వంటివి ఉపయోగించేందుకు ‘స్మార్ట్‌కీ’ని కంపెనీ అందిస్తోంది. వీటితో పాటు కాల్‌ రికార్డింగ్‌, ట్విన్‌ యాప్స్‌, ఎఫ్‌ఎం రేడియో, యాప్‌లాక్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి సదుపాయాలు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

ధరెంత? అమ్మకాలు ఎప్పటి నుంచి?
ఆసుస్‌ కంపెనీ దీని 6జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను 31,999గా పెట్టింది. ఇక 6జీబీ/128జీబీ వేరియంట్‌ వచ్చేసరికి రూ.34,999గానూ, 8జీబీ/256జీబీ వేరియంట్‌ ధరను రూ.39,999గానూ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో జూన్‌ 26 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మిడ్‌నైట్‌ బ్లాక్‌, ట్విల్‌ లైట్‌ సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.

ఆఫర్లేంటి..?ఏమేం వస్తాయి? 
ఫోన్‌తో పాటు ఫోన్‌ బ్యాక్‌ కేస్‌ను కూడా కంపెనీనే అందిస్తోంది. దీంతో పాటు లాంచింగ్‌ ఆఫర్‌ కింద మొబైల్‌ ప్రొటక్షన్‌ ప్లాన్‌ను రూ.99కే అందిస్తోంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌కు ఈ ప్లాన్‌ దాదాపు రూ.3,999 దాకా ఉంటుంది. ఫోన్‌తో పాటు హెడ్‌ఫోన్స్‌, 18W క్విక్‌ ఛార్జర్‌ 4.0ను బాక్స్‌లో అందిస్తారు.

మరిన్ని వివరాలను ఈ లింక్‌లో చూడొచ్చు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.