Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145565
            [news_title_telugu_html] => 

రూ.9కే విమానం టికెట్‌

[news_title_telugu] => రూ.9కే విమానం టికెట్‌ [news_title_english] => Vietjet Ready for India Operations with Tickets Priced at Rs 9 [news_short_description] => వియత్నాంకు చెందిన వియెట్‌జెట్‌ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దిల్లీ నుంచి ఈ సంస్థ తమ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా దీని ప్రచారం నిమిత్తం ‘గోల్డెన్‌ డేస్‌’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది......... [news_tags_keywords] => VietJet,Delhi,Vietnam [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 15:15:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రూ.9కే విమానం టికెట్‌ - Vietjet Ready for India Operations with Tickets Priced at Rs 9 - EENADU
close

తాజా వార్తలు

రూ.9కే విమానం టికెట్‌

దిల్లీ: వియత్నాంకు చెందిన వియెట్‌జెట్‌ సరికొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దిల్లీ నుంచి ఈ సంస్థ తమ సర్వీసులను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా దీని ప్రచారం నిమిత్తం ‘గోల్డెన్‌ డేస్‌’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇకపై భారత్‌ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సౌకర్యం లభించనుంది. డిసెంబర్‌ 6 నుంచి ఈ సేవలు మొదలవుతాయి. దిల్లీ నుంచి వియత్నాంలోని హో చి మిన్‌ వరకు రెండు విమానాలను నడపనుంది.  దిల్లీ - హోచిమిన్‌ నగరానికి వారానికి నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం)ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా హనోయ్‌-దిల్లీ మార్గంలో డిసెంబర్‌ 7నుంచి వారానికి మూడు  విమానాలను నడపనున్నారు.

‘సూపర్‌ సేవింగ్‌ టికెట్స్’ పేరుతో ఆగస్టు 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.  టికెట్ల ధరలు రూ.9 నుంచి ప్రారంభమవుతాయి. అయితే టికెట్‌కు అదనపు సుంకాలు ఉంటాయి. 2011లో వియెట్‌జెట్‌ తన సర్వీసులు ప్రారంభించింది. రోజుకు 400 విమానాలను, 129 మార్గాల్లో నడుపుతోంది. ఇప్పటి వరకు 80మిలియన్ల మందికి సేవలందించింది. భారత్‌లో ఈ సంస్థ సర్వీసులు లేవు. దీంతో ఈ ఏడాది నుంచి మొదలు పెట్టనుంది. www.vietjetair.com నుంచి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. కొన్నాళ్ల క్రితం ఎయిర్‌హోస్టెస్‌ డ్రెస్సింగ్ విషయంలో ఈ సంస్థ వివాదంలో నిలిచింది. బికీనీలు వేసుకుని విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంది. వియత్నాం పౌర విమానయాన ప్రాధికార సంస్థ(సీఏఏవీ) ఆగ్రహం వ్యక్తం చేసి ఈ సంస్థకు జరిమానా కూడా విధించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.