close

తాజా వార్తలు

సాక్షి మహరాజ్‌ మళ్లీ మాట్లాడారు..

దిల్లీ: అయోధ్య రామ మందిరం నిర్మాణంపై భాజపా సీనియర్‌ నేత సాక్షి మహరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మందిర నిర్మాణం త్వరలో సాకారం కాబోతోందని విశ్వాసం వ్యక్తంచేశారు. డిసెంబర్‌ 6 నుంచి దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని జోస్యం చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం సరిగ్గా అదే తేదీన బాబ్రీ మసీదును కూల్చివేయడం గమనార్హం. ‘‘అయోధ్య రామమందిరం అంశానికి సంబంధించి విచారణ దాదాపు పూర్తయ్యింది. డిసెంబర్‌ 6 నుంచి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నా’’ అని సాక్షి మహరాజ్‌ పేర్కొన్నారు.

అయోధ్య అంశంపై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఇటీవలే ప్రధాని మోదీ పరోక్షంగా చురకలంటించారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై ఎవరూ మాట్లాడొద్దని, రెండు చేతులెత్తి వేడుకుంటున్నా అని మోదీ అన్నారు. పరోక్షంగా శివసేనను ఉద్దేశిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు.  గతంలోనూ సాక్షి మహరాజ్‌ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.