
తాజా వార్తలు
న్యూదిల్లీ: వినియోగదారులకు టెలికాం కంపెనీలు షాకిచ్చాయి. తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కంపెనీలు ఒకేరోజు ప్రకటించాయి. డిసెంబర్ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు వొడాఫోన్ఐడియా, ఎయిర్టెల్ పేర్కొంది. అయితే ఎంత మొత్తంలో పెంచుతున్నదీ రెండు కంపెనీలూ వెల్లడించలేదు. వినియోగదారులకు ప్రపంచస్థాయి డిజిటల్ సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వొడాఫోన్ పేర్కొనగా.. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో ఈ రెండు కంపెనీలు భారీ మొత్తంలో నష్టాలు ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పెంపు నిర్ణయం వెలువరించడం గమనార్హం.
క్యూ2 ఫలితాల్లో వొడాఫోన్ రూ.50,921 కోట్ల మేర నష్టాలను ప్రకటించింది. ఎయిర్టెల్ సైతం రూ.23,045 కోట్ల మేర నష్టాలు వచ్చాయని పేర్కొంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో టెలికాం కంపెనీలపై పెను భారం పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా కంపెనీలు కోరుతున్నాయి. ప్రభుత్వం సహకరించకుంటే భారత్‌లో తాము కొనసాగడం కష్టమేనని వొడాఫోన్ కంపెనీ ఇటీవల పేర్కొంది. మరోవైపు ఐయూసీ ఛార్జీల నేపథ్యంలో వేరే నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌పై నిమిషానికి 6పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు జియో ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సైతం వినియోగదారులపై భారం మోపడానికి సిద్ధమవ్వడం గమనార్హం.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
