
తాజా వార్తలు
నాకు నాలుగు నెలల క్రితమే పెళ్లయ్యింది. మేం కలయికలో పాల్గొన్నప్పుడు మా వారి వీర్య కణాలు బయటకు వచ్చేస్తున్నాయి. అలా రావడం వల్ల గర్భం దాల్చలేను కదా... దీనికి ఏదయినా పరిష్కారం ఉందంటారా...
- ఓ సోదరి
సాధారణంగా వీర్యకణాలు 1-5 సీసీ వరకూ ఉంటాయి. ఇక వాటి సంఖ్య 20 నుంచి 100 మిలియన్ల వరకూ ఉంటాయి. అయితే గర్భం రావడానికి ఒక వీర్యకణం చాలు. వీర్యకణాలు బయటకు పోతున్నాయని అనుకుంటారు కానీ... కాదు. కేవలం కొన్ని మాత్రమే యోనిమార్గంలోకి ప్రవేశిస్తాయి. వాటిల్లో చురుగ్గా, ఆరోగ్యకరంగా ఉన్నది మాత్రమే గర్భాశయ ముఖద్వారాన్ని దాటి గర్భాశయంలోని అండాన్ని చేరుతుంది. అప్పుడే అది ఫలదీకరణ చెందుతుంది. ఇంకా సూటిగా చెప్పాలంటే 1 సీసీ వరకూ మాత్రమే యోని మార్గంలోకి వెళతాయి. అవసరం లేనివి బయటకు వస్తాయి. కాబట్టి కలయిక సమయంలో వీర్యకణాలు బయటకు వచ్చేయడం వల్ల గర్భం రాదనుకోవడం కేవలం అపోహ మాత్రమే. మీకు ఇంకా ఏవయినా సందేహాలు ఉంటే మీ దగ్గర్లోని వైద్యుల్ని సంప్రదించండి.
* మీ సందేహాలను, సమస్యల్ని vasuhealth@eenadu.net కు పంపించగలరు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
