close

తాజా వార్తలు

ప్రేమ జంటపై దాడి: యువతి మృతి

 తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న యువకుడు

 నవులూరు (గ్రామీణ మంగళగిరి), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరిలో దారుణం చోటుచేసుకుంది. మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సమీపంలో ఓ ప్రేమజంటపై గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. ఈ ఘటనలో యువతి అంగడి జ్యోతి (24) అక్కడికక్కడే మృతిచెందింది. యువకుడు చుంచు శ్రీనివాస్‌ (26) తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లి మహానాడుకు చెందిన చుంచు శ్రీనివాస్‌, అంగడి జ్యోతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు కలిసి సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మంగళగిరి మండలం నవులూరు ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ఈ జంటపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఈ ఘటనలో జ్యోతికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్‌ తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గ్రామీణ మంగళగిరి పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు బాధితుడిని చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. ఉత్తరమండల డీఎస్పీ రామకృష్ణ, తాడేపల్లి సీఐ బ్రహ్మయ్య ఆసుపత్రికి చేరుకొని  శ్రీనివాస్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ రామకృష్ణ తెలిపారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.