Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111095
            [news_title_telugu_html] => 

పేలిపోయిన విమాన టైరు..

[news_title_telugu] => పేలిపోయిన విమాన టైరు.. [news_title_english] => Despite tyre burst SpiceJet flight lands safely at Jaipur airport [news_short_description] => స్పైస్‌ జెట్‌ విమాన టైరు పేలిపోవడంతో ఈ విషయాన్ని గుర్తించిన పైలట్.. దాన్ని‌ చాకచక్యంగా విమానాశ్రయంలో దించిన ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. [news_tags_keywords] => SpiceJet,Flight,Jaipur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/1tVu9zPO1XE [news_videoinfo] => |https://www.youtube.com/embed/1tVu9zPO1XE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 15:01:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పేలిపోయిన విమాన టైరు.. - Despite tyre burst SpiceJet flight lands safely at Jaipur airport - EENADU
close

తాజా వార్తలు

పేలిపోయిన విమాన టైరు..

జైపుర్‌: స్పైస్‌ జెట్‌ విమాన టైరు పేలిపోవడంతో ఈ విషయాన్ని గుర్తించిన విమానాశ్రయ సిబ్బంది, పైలట్.. అన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని విమానాశ్రయంలో సురక్షితంగా దించిన ఘటన రాజస్థాన్‌లోని జైపుర్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. అందులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 189 మంది ఉన్నారని చెప్పారు. ఈ విమానం దుబాయ్ నుంచి జైపుర్ చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై స్పైస్‌ జెట్‌ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ... ‘‘జైపుర్‌లో ఆ విమానం దిగాల్సిన సమయంలో ఇక్కడి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఆ విమాన టైరు పేలిపోయినట్లు తెలిసింది. ఈ విషయంపై పైలట్‌తో మాట్లాడారు. ఆ విమానాన్ని సురక్షితంగా జైపుర్‌ విమానాశ్రయంలో దించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు’’ అని తెలిపారు.

ఆ విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా దిగారని, ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు తెలిపారు. విమాన టైరు పేలిన కారణాలను ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. కాగా, గతేడాది ఫిబ్రవరీ 9న కూడా ఓ స్పైస్‌జెట్‌ విమాన టైరు పేలిన ఘటన వెలుగులోకొచ్చింది. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమాన టైరు పేలడంతో చెన్నై విమానాశ్రయంలో దాన్ని అత్యవసరంగా దించారు. ఆ సమయంలోనూ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.     ‌

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.