close

తాజా వార్తలు

అమెరికాలో 2 టీ20లు ఆడనున్న కోహ్లీసేన

సెయింట్‌ జాన్స్‌ (ఆంటిగ్వా): భారత్‌ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను వెస్టిండీస్‌తో ఆరంభించనుంది. రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ ఆగస్టు 22 నుంచి ప్రారంభమవుతుంది. అంతకన్నా ముందుగా 3వ తేదీ నుంచి టీ20లు మొదలవుతాయి. 2019లో టీమిండియా పర్యటిస్తున్న ఒకే ఒక దేశం వెస్టిండీస్‌. ఇక టెస్టులు, టీ20లే కాకుండా రెండు జట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి.

తొలి టెస్టు ఆగస్టు 22 నుంచి 26 వరకు సెయింట్‌ జాన్స్‌లోని వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో జరుగుతుంది. రెండో టెస్టు జమైకాలోని సబీనా పార్క్‌లో ఆగస్టు 30న ఆరంభమవుతుంది. రెండేళ్ల పాటు టెస్టు ఛాంపియన్‌షిప్‌ జరుగుతుంది. ఐసీసీలో టెస్టు హోదా ఉన్న అన్ని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. చివరికి ఫైనల్‌ టెస్టు నిర్వహిస్తారు. ‘వెస్టిండీస్‌, భారత్‌ మధ్య ఆహ్లాదకర శత్రుత్వం ఉంది. మా జట్టు మూడు ఫార్మాట్లలోని అన్ని మ్యాచుల్లో ఉత్కంఠకర పోటీనిస్తుంది’ అని వెస్టిండీస్‌ క్రికెట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జానీ గ్రేవ్‌ అన్నారు.

అమెరికాలో టీ20లు

విండీస్‌తో కోహ్లీసేన మూడు టీ20ల్లో తలపడనుంది. రెండు మ్యాచులు అమెరికాలోని ఫ్లోరిడాలో ఆగస్టు 3, 4 తేదీల్లో వెంటవెంటనే జరుగుతాయి. మూడేళ్ల క్రితమూ రెండు జట్లు అమెరికాలో రెండు టీ20ల సిరీస్‌లో తలపడ్డాయి. వర్షం కారణంగా ఒకటి రద్దైంది. అక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లోనే కేఎల్‌ రాహుల్‌ 46 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఛేదనలో ఎవిన్‌ లూయిస్‌ 49 బంతుల్లో శతకంతో చెలరేగడంతో విండీస్‌ పరుగు తేడాతో గెలిచింది. మొత్తంగా ఆ మ్యాచులో 489 పరుగులు నమోదు కావడం గమనార్హం. చివరి టీ20 ఆగస్టు 6న గయానాలో నిర్వహిస్తారు. ఆగస్టు 8, 11, 14న వన్డేలు జరుగుతాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.