
తాజా వార్తలు
ముగ్గురు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి బాంబులు విసిరారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో సోహెల్ రాణా(19), కైరుద్దీన్ షేక్(55) టీఎంసీ కార్యకర్తలు. ముర్షిదాబాద్‌లోని డోమ్‌కోల్ పోలీస్ స్టేషన్ పరిథిలో చోటు చేసుకుందీ దారుణం. ఘటనా సమయంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య గొడవలు కూడా జరిగాయి. ఈ ఘటనకు కాంగ్రెస్ నేతలే కారణమని కైరుద్దీన్ షేక్ కుమారుడు ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో అందరూ ఇంట్లో నిద్రిస్తుండగా తమ ఇంటి వద్ద శబ్దం వినిపించిందని బయటకి వచ్చి చూస్తే తన తండ్రి విగత జీవిగా కనిపించాడని మృతుడి కొడుకు పోలీసులకు తెలిపారు. సోహెల్ రాణా తండ్రి అల్తాఫ్ హుస్సేన్‌ను సైతం కొద్ది రోజుల ముందు ఇదే తరహాలో హతమార్చారని ఆయన ఆరోపించారు. అయితే ఘటన కారణంగా జరిగిన తోపులాటలో పలువురు తీవ్రంగా గాయ పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
