close

తాజా వార్తలు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథలో ఐశ్వర్యా రాజేష్‌

చిత్ర బృందం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: మేయాదమాన్‌, మెర్క్యూరి వంటి చిత్రాలను అందించిన కార్తిక్‌సుబ్బరాజ్‌ సమర్పణలో నాలుగో చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌, హర్రర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రతీంద్రన్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ నీలగిరిలో మొదలైంది. పృథ్వీ చంద్రశేఖర్‌ సంగీతం సమకూర్చుతున్నారు. రొబర్డో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ఐశ్వర్యా రాజేష్‌ ఇందులో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. థ్రిల్లర్‌, హర్రర్‌ సినిమాల ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ఈ జోనర్‌లో ఇదివరకు వచ్చిన సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని తప్పకుండా చెప్పగలనని’ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.