close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్ - 9 AM

1. కేంద్రం చిన్నచూపు

కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సహకరించడం లేదని, రాజకీయ కారణాలతో అనేక అంశాల్లో చేయూతనివ్వడం లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు అభిప్రాయపడినట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం 5:10 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఇద్దరు సీఎంల మధ్య భేటీ జరిగింది. గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు తరలింపు ప్రాజెక్టు వెంటనే చేపట్టాలని అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఆంధ్రప్రదేశ్‌ను తాకిన తవుడు కుంభకోణం!

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన తవుడు దొంగల బాగోతం ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. రూ.వందల కోట్ల విలువ చేసే తవుడు వ్యాపారం చేసిన కొందరు కమీషన్‌ ఏజెంట్లు పన్ను ఎగవేశారు. మరికొందరు నకిలీ బిల్లులతో ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము కొట్టేశారు. ‘తవుడు పన్ను బుక్కారు’ శీర్షినక ఆదివారం ‘ఈనాడు’ ఈ బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మిర్యాలగూడ కేంద్రంగా ఈ దందాను గుర్తించిన అధికారులు..ఈ కుంభకోణం రెండు  రాష్ట్రాల్లోనూ సాగినట్లు నిర్ధారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. బోటు ప్రమాద మృతుల జాబితా ప్రకటన

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో చోటుచేసుకున్న బోటు ప్రమాద మృతులకు సంబంధించిన జాబితాను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమాకంపెనీ నుంచి ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. అమరావతి నగరాభివృద్ధికి రూ.750 కోట్లు

అమరావతి ఆకర్షణీయ నగరాభివృద్ధికి రూ.750 కోట్లను విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది రూ.552 కోట్లు విడుదల చేయగా వాటిని సకాలంలో ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు చేసిన వినతి మేరకు ఆ నిధులతో కలిపి 2019-20 సంవత్సరానికి ఇప్పుడు మొత్తం రూ.750 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘టి-ఫైబర్‌’ పనులు ప్రారంభం

తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తరఫున అతిపెద్ద ఫైబర్‌ ప్రాజెక్టు (టి-ఫైబర్‌) పనులను ఎల్‌అండ్‌టీ మొదలు పెట్టింది. ఎల్‌అండ్‌టీలోని స్మార్ట్‌ వరల్డ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ విభాగం ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 65,000 కిలోమీటర్ల పొడవైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వేయాల్సి ఉంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. ‘గద్దలకొండ గణేష్‌’ విజయోత్సవ వేడుక

7. మాటలు కాదు ఇక చేతలే

వాతావరణ మార్పులపై పోరుకు ‘అంతర్జాతీయ ప్రజా ఉద్యమం’ అవసరమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం పిలుపునిచ్చారు. మాటలు ఆపి.. చేతలు మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భారత శిలాజేతర ఇంధన ఉత్పత్తి లక్ష్యాలను రెట్టింపు కన్నా ఎక్కువ స్థాయికి పెంచుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆయన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ఒకే దేశం.. ఒకే కార్డు!

డిజిటల్‌ రూపంలో జనాభా లెక్కల సేకరణ వల్ల పౌరుల ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, బ్యాంకు ఖాతాలు వంటి వాటిని ఒకే కార్డులో నిక్షిప్తం చేయడానికి వీలు కలుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చెప్పారు. ఈ మేరకు ‘బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు’ను జారీచేసే ఆలోచనను ఆయన తెరపైకి తెచ్చారు. 2021 జనాభా లెక్కల సేకరణలో తొలిసారిగా మొబైల్‌ యాప్‌ను ఉపయోగించనున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కేంద్ర ఉద్యోగుల రిటైర్మెంట్‌ @ 60

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు విషయంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం పదవీ విరమణ వయసును రెండు రకాలుగా నిర్ధరించనున్నారు. 1) 33 ఏళ్ల సర్వీసు. 2) 60 ఏళ్ల వయోపరిమితి. ఈ రెండింటిలో ఏది ముందయితే దానిని పరిగణనలోకి తీసుకుని... ఆ సమయానికి ఉద్యోగి రిటైర్‌ అయ్యేలా నిబంధనలను సవరిస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అమెరికాతో చేతులు కలపడం అతిపెద్ద తప్పు: ఇమ్రాన్‌

పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడుల అనంతరం ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో చేతులు కలపడం ద్వారా పాక్‌ అతిపెద్ద తప్పు చేసిందని పేర్కొన్నారు. నాడు తాము తటస్థంగా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గ సదస్సులో ఇమ్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.