close

తాజా వార్తలు

నరేంద్ర మోదీ నోట.. ‘ప్లాగింగ్‌’ మాట?

ప్లాగ్‌రన్‌’ భారత ప్రధాని మోదీ 57వ ‘మన్‌కీబాత్‌’ ప్రసంగంలో ఆయన నోటి నుంచి వచ్చిందీ మాట. రిపుదామన్‌ బెవ్లీ అనే వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని మోదీ అందులో పేర్కొన్నారు. అంతే ప్రస్తుతం దేశమంతా ఈ ప్లాగ్‌ రన్‌ అంటే ఏమిటని తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. తెలియని వారు గూగుల్‌లో వెతకడం ప్రారంభిస్తే.. తెలిసిన వారు తాము కూడా ఇందులో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మరి అసలు ఈ ప్లాగ్‌ రన్‌ అంటే ఏమిటి? అది చేపట్టిన ఈ రిపుదామన్‌ బెవ్లీ ఎవరు? అతన్ని మోదీ ఎందుకు ప్రశంసించారు. తెలుసుకుందామా మరి..


ప్లాగింగ్‌ ఏంటి?ఎక్కడ ప్రారంభమైంది?
చాలామంది నిత్యం ఉదయాన్నే శారీరక దారుఢ్యం కోసం జాగింగ్‌ చేస్తుంటారు. జాగింగ్‌ ద్వారా ఇలా శారీరక దృఢత్వం పెంచుకుంటూనే మనం నడుస్తున్న రోడ్డుపై చెత్తను కూడా ఏరివేసి పరిశుభ్రంగా మార్చడాన్నే ప్లాగ్‌రన్‌ అంటారు. ఈ ప్లాగ్‌ రన్‌ తొలిసారిగా 2016లో స్వీడన్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత 2018లో ఇది ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా విస్తరించింది. అయితే తాజాగా రిపుదామన్‌ బెవ్లీ అనే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ స్ఫూర్తితో దీన్ని భారత్‌లోనూ ప్రారంభించి సంచలనం సృష్టించారు. 

రిపుదామన్‌ ఏం చేశాడు?
పరిసరాలు స్వచ్ఛంగా ఉంటేనే పరిశుభ్రమైన, ఆరోగ్యమైన దేశాన్ని నిర్మించగలమనే ఉద్దేశంతో ప్రధాని మోదీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్న బెవ్లీ తాను కూడా ఇందులో భాగం కావాలని నిర్ణయించుకున్నారు. విదేశాల్లో ఇందుకోసం ఉపయోగించే మార్గాల్ని తెలుసుకున్నారు. విదేశాల్లో కొందరు దేశ స్వచ్ఛత కోసం ఉదయం జాగింగ్‌తో ప్లాగ్‌రన్‌ చేస్తున్నారని తెలుసుకుని తాను కూడా ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే రిపుదామన్‌ అందరిలా సాదాసీదాగా చెప్పిఊరుకోలేదు. ఒకటి కాదు రెండు కాదు దేశవ్యాప్తంగా ఏకంగా 1000 కిలోమీటర్ల ప్లాగ్‌రన్‌ చేసేందుకు సంకల్పించారు. అదే ఉత్సాహంతో సెప్టెంబర్‌ 5న తన దేశవ్యాప్త ప్లాగ్‌రన్‌ ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తన ప్లాగ్‌ రన్‌ కేరళ నుంచి దేశ రాజధాని దిల్లీ వరకు 50 పెద్ద నగరాలను తాకుతూ వెళుతుందని ఆ మార్గంలో చెత్తను శుభ్రం చేస్తానని చెప్పారు. చెత్త రహిత భారతదేశమే తన సంకల్పమని ఆయన వెల్లడించారు. మన ఆరోగ్యాన్ని బాగు పరచుకునే ప్రక్రియలో మనం వాతావరణంపై ఎలా ప్రభావం చూపించగలమనేది దేశానికి చూపించాలని ఈ కార్యానికి సంకల్పించినట్లు ఇది నవంబర్‌ 2న దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద పూర్తవుతుందని చెప్పారు. 

మోదీ ప్రశంసలు..
ప్రధాని మోదీ ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన అక్కడ ప్రసంగించిన ముఖ్య అంశాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుకు ప్రధాన కారణం సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ అని ప్రస్తావిస్తూ.. మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని భారతదేశంలో పూర్తిగా ఒకేసారి వాడే ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని వెల్లడించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు దేశ స్వచ్ఛత కోసం కృషి చేస్తున్న రిపుదామన్‌ గురించి తెలియడంతో అమెరికా నుంచి వచ్చిన తర్వాత తొలి ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన గురించి ప్రస్తావించారు. దేశ స్వచ్ఛత కోసం రిపుదామన్‌ బెవ్లీ తీసుకున్న ముందడుగు ఎంతో గొప్పదని ప్రశంసించారు. ప్లాగింగ్‌ ఎక్కువగా విదేశాల్లో చేస్తుంటారు. దీని గురించి ఇప్పుడే తొలిసారిగా వింటున్నాను. బెవ్లీ దీన్ని భారత్‌లో చేపట్టి పాపులర్‌ చేశారంటూ అభినందించారు. అదే సమయంలో ప్రధానితో బెవ్లీ ఫోన్‌లో మాట్లాడుతూ.. మేము దీనిపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘మనం దేశాన్ని చెత్త రహితంగా మార్చగలిగితే.. ప్లాస్టిక్‌ రహితంగా చేసినట్లే’ అని అభిప్రాయపడ్డారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.