
తాజా వార్తలు
తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్ మద్యపాన నిషేధం పేరుతో 'జె' ట్యాక్స్ వసూలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీ రేట్ల కంటే 20 రూపాయలు ఎక్కువ ధరకు మద్యం విక్రయించడం చట్టాలను అతిక్రమిoచటమేనన్నారు. దసరా పండుగ రోజు అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు సాగించారని మండిపడ్డారు. మద్యం అమ్మకాలు ఎంత ఎక్కువగా ఉంటే 'జె' ట్యాక్స్ అంత పెరుగుతుందని ఎద్దేవాచేశారు. కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వ్యక్తికి ముఖ్యమంత్రి హోదా ఇస్తే పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైందని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Tags :