
తాజా వార్తలు
విశాఖపట్నం: ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న కార్మికుల బాధలు చూడలేకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ర్యాలీ చేస్తున్నారని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానంపై అనేక విమర్శలు చేసిన జగన్.. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక సరఫరా ఆపేశారని ఆరోపించారు. పవన్ ఆందోళనలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వీవీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల సుమారు 50 నుంచి 70 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని మనోహర్ అన్నారు. ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పడ్డారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మరోవైపు ఆదివారం నిర్వహించనున్న లాంగ్ మార్చ్‌కు విశాఖపట్నం పోలీసులు అనుమతి మంజూరు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్లో ప్రకటించారు. ర్యాలీకి అనుమతి లేదన్న వైకాపా నేతల ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ఈ మేరకు అనుమతి పత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
