
తాజా వార్తలు
‘రెండిటి మధ్య చిన్న గీత ఉంటుంది’
హైదరాబాద్: రియల్ లైఫ్‌కు రీల్ లైఫ్‌కు చాలా తేడా ఉందని కథానాయిక సమంత అంటున్నారు. ఆమె నటించిన చిత్రం ‘మజిలీ’. నాగచైతన్య కథానాయకుడిగా నటించారు. దివ్యాంశా కౌశిక్ మరో కథానాయిక. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధమౌతోంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాలో చైతన్య ప్రేయసిగా దివ్యాంశా, భార్యగా సమంత కనిపించనున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. అందులో చైతన్య.. నటి దివ్యాంశాను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ‘రంగస్థలం’ సినిమాలోనూ సామ్ కథానాయకుడు రామ్‌చరణ్‌ను ఓ సన్నివేశంలో ముద్దుపెట్టుకున్నారు. అప్పట్లో అది చర్చనీయాంశంగా మారింది. ‘నేను కేవలం చరణ్ బుగ్గలపై ముద్దుపెట్టా, ఆ సీన్ సుకుమార్ కెమెరా ట్రిక్’ అని సామ్ అన్నారు.
‘మజిలీ’లో చైతన్య ముద్దు సన్నివేశం గురించి సామ్‌ను తాజా ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించారు. నటనలో ఇవన్నీ భాగమని చెప్పారు. ‘మా మధ్య అద్భుతమైన బంధం ఉంది, మేం మంచి స్నేహితులం, పెళ్లి కూడా చేసుకున్నాం.. ముందు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి. నటనకు, నిజానికి మధ్య చిన్న గీత ఉంటుంది. నా పరంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనే. ఈ విషయాన్ని నేను అభిమానులకు కూడా చెప్పాలి అనుకున్నా. ఇదే రూల్ నాకు, చైకు వర్తిస్తుంది’ అని సామ్ పేర్కొన్నారు.
‘
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
ఎక్కువ మంది చదివినవి (Most Read)
