close

తాజా వార్తలు

నయనతారను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయ్‌

నటిపై సీనియర్‌ నటుడి అనుచిత వ్యాఖ్యలు
ఆగ్రహించిన ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు రాధా రవి.. నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నయన్‌ నటించిన ‘కోళయుథిర్‌ కాలం’ అనే సినిమా ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల చెన్నైలో ఏర్పాటుచేశారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో దర్శకుడు, నిర్మాత కూడా సినిమాను వదిలేసుకున్నారు. అయినప్పటికీ పూర్తికాని ఈ సినిమా ప్రచార వేడుకకు రాధా రవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పైకి వచ్చి ప్రసంగిస్తూ నయన్‌పై కామెంట్లు చేశారు. ‘నయనతార ఇప్పుడు ఒక స్టార్‌ నటి. ఆమెను అంతా లేడీ సూపర్‌స్టార్‌ అంటారు. ఆమెను ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌లతో సమానంగా చూస్తారు. ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ అమరులు. అలాంటివాళ్లతో నయనతారను పోలుస్తున్నందుకు చాలా బాధగా ఉంది. నయన్‌ మంచి నటే. అందుకే ఆమె ఇండస్ట్రీలో ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చారు. ఆమెపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయినా అన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. ఇలాంటి విషయాలను తమిళనాడు ప్రజలు నాలుగు రోజులకు మించి గుర్తుపెట్టుకోరు. ఒకప్పుడు సినిమాలో దేవత పాత్రలు చేయాలంటే అందుకు కేఆర్‌ విజయనే సంప్రదించేవారు. కానీ ఇప్పుడు ఎవరుపడితే వారు (నయన్‌ను ఉద్దేశిస్తూ) దేవతామూర్తుల పాత్రలను పోషిస్తున్నారు. నయన్‌ హారర్‌ చిత్రాల్లోనూ నటిస్తారు. చెప్పాలంటే నయన్‌ను చూసి దెయ్యాలు కూడా పారిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. రాధా రవి ప్రసంగిస్తున్నప్పుడు కార్యక్రమంలో నయన్‌ లేరు. నయన్‌ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనరు. అది ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చేసుకున్న అగ్రీమెంట్‌. దాంతో ఆయన మాటలు కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నయన్‌ ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో పాటు చిన్మయి శ్రీపాద, రాధికా శరత్‌కుమార్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు ట్విటర్‌ వేదికగా రాధా రవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై రాధిక మాట్లాడుతూ.. ‘మన చిత్ర పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటీమణుల్లో నయనతార ఒకరు. ఆమెతో నాకు పరిచయం ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. రాధా రవి ఏం మాట్లాడారో నేను వినలేదు. ఈరోజు ఆయన్ను కలిశాను. ఇదేమీ బాగోలేదని చెప్పాను’ అని ట్వీట్‌ చేశారు.
విఘ్నేశ్‌ శివన్‌ మాట్లాడుతూ.. ‘ఓ గొప్ప కుటుంబానికి చెందిన వ్యక్తులు అసభ్యంగా మాట్లాడుతుంటే ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. పాపులారిటీ కోసం ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు. అసలు ఆయనకు బుర్రలేదు. ఆయన మాటలకు ప్రేక్షకులు నవ్వడం, క్లాప్స్‌ కొట్టడం చూసి బాధేస్తోంది. ఓ సినిమా చిత్రీకరణ పూర్తికాకుండానే ప్రచార కార్యక్రమం ఏర్పాటుచేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఈ సినిమా నిర్మాతలు, దర్శకుడు ఎప్పుడో చిత్రీకరణను నిలిపివేశారు. అలాంటప్పుడు అవసరం లేని కార్యక్రమాలు పెట్టి ఏం మాట్లాడాలో తెలీక చెత్త మాటలు అనేస్తున్నారు. దీనిని సినిమా ప్రచార కార్యక్రమం అంటారా? ఏం మాట్లాడాలో తెలీనప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లకపోవడమే మంచిది. ఏదేమైనా ఆయనపై నడిగర్‌ సంఘం కానీ మరే సంఘం కానీ యాక్షన్‌ తీసుకోదన్న విషయం నాకు తెలుసు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్మయి శ్రీపాద మాట్లాడుతూ.. ‘ఈ అంశంపై తమిళనాడుకు చెందిన మగవారు మాట్లాడతారేమోనని నిన్నటి నుంచి ఎదురుచూస్తున్నా’ అన్నారు.
వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘మహిళలను తక్కువ చేసి మాట్లాడటం చిత్ర పరిశ్రమకు అలవాటైపోయింది. మౌనంగా ఉంటే కుదరదు. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలవాలి. ఇన్ని సంఘాలు ఉన్నా కూడా నటీమణుల విషయానికొచ్చే సరికి ఎలాంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ తీసుకుంటే వారి స్థాయి పడిపోతుందన్న భయం’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.