
తాజా వార్తలు
‘83’ చిత్ర బృందం కసరత్తులు
ముంబయి: ‘83’ సినిమా కోసం రణ్వీర్ సింగ్, మిగిలిన చిత్ర బృందం చెమట చిందించారు. 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలో టీమిండియా ప్రపంచ కప్ ఎలా సాధించిందనే నేపథ్యంలో ‘83’ చిత్రం రాబోతోంది. ఇందులో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. 2020 ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
క్రికెట్లో శిక్షణ నిమిత్తం రణ్వీర్తో పాటు మిగిలిన నటీనటులు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అక్కడ రణ్‌వీర్‌కు కపిల్‌తోపాటు పలువురు క్రికెటర్లు మెళకువలు నేర్పించారు. ఈ సినిమా కోసం చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియోను రణ్వీర్ ట్విటర్లో షేర్ చేశారు. అందరూ నటీనటులు ఎంతో శ్రమిస్తూ కనిపించారు. నటరాజ్ షాట్‌ను రణ్వీర్ పర్ఫెక్ట్గా చేశారు. ఈ చిత్రం విడుదల కోసం సినీ, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The incredible untold story of India’s greatest victory! ????
— Ranveer Singh (@RanveerOfficial) April 19, 2019
10th April 2020- Good Friday #Relive83 @83thefilm @kabirkhankk pic.twitter.com/4ziVRtOLKD
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
