
తాజా వార్తలు
హైదరాబాద్: ‘సాహో’ సినిమా టీజర్ తనకు చాలా నచ్చిందని అగ్ర కథానాయిక అనుష్క అన్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయిక. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, మందిరా బేడీ, వెన్నెల కిశోర్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. సినీ ప్రముఖులు, విమర్శకులు టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గానూ ఇది రికార్డు సృష్టించింది. కాగా ఈ టీజర్‌ను చూసిన అనుష్క ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. ‘‘సాహో’ టీజర్ పూర్తిగా చాలా నచ్చింది. యూవీ క్రియేషన్స్, ప్రభాస్, సుజీత్.. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. సినిమా కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆమె పోస్ట్ చేశారు. అనుష్క ప్రస్తుతం తన తర్వాతి సినిమా ‘నిశ్శబ్దం’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- రాహుల్‌కు ఆ పేరే కరెక్ట్.. భాజపా ఎటాక్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
