Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113817
            [news_title_telugu_html] => 

సంపాదించుకుంటూ పోతే లావైపోతాం!

[news_title_telugu] => సంపాదించుకుంటూ పోతే లావైపోతాం! [news_title_english] => Actresses who also involved in social service story [news_short_description] => సంపాదించుకుంటే పోతే ఎలా.. మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులు, మన చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏమైనా చేయాలిగా.. లేకపోతే లావైపోతాం అనుకుంటున్నారు నటీమణులు. ఇప్పుడు స్టార్‌ హోదాలో.... [news_tags_keywords] => special story,kajal,samantha,shruti hassan,aishwarya rai,deepika padukone,priyanka chopra [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 09:19:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సంపాదించుకుంటూ పోతే లావైపోతాం! - Actresses who also involved in social service story - EENADU
close

తాజా వార్తలు

సంపాదించుకుంటూ పోతే లావైపోతాం!

సేవ కోసం ఖర్చు చేస్తున్న భామలు

సంపాదించుకుంటూ పోతే ఎలా.. మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రేక్షకులు, మన చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏమైనా చేయాలిగా.. లేకపోతే లావైపోతాం అనుకుంటున్నారు నటీమణులు. ఇప్పుడు స్టార్‌ హోదాలో ఉన్న వారంతా ఒకప్పుడు ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొన్న వారే. ఈ ప్రయాణంలో వారు జీవితంతో పోరాడే ఎంతో మందిని చూసుంటారు. అందుకే మనవంతుగా సహాయం చేయాలని భావిస్తూ సామాజిక సేవలో పాల్గొంటున్నారు. అవసరాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. నిజ జీవితంలోనూ తమ మంచి మనసుతో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న ముద్దుగుమ్మలు ఎవరంటే..

ఐశ్వర్యరాయ్‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ అందాల కిరీటం గెలుచుకుని 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2014లో 100 మంది చిన్నారుల సర్జరీలకు విరాళం అందించారు. 2004లో ‘ఐశ్వర్యరాయ్‌ ఫౌండేషన్‌’ స్థాపించి దాని ద్వారా అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్నారు. అంతేకాదు నేత్రదానం చేస్తానని కూడా ఆమె ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు ఆమె ‘పెటా’తో కలిసి పనిచేస్తున్నారు.

కాజల్‌

పిల్లల చదువుల కోసం సహాయం చేయడానికి ముందుకొచ్చింది అందాల ‘చందమామ’ కాజల్‌. ఆంధ్రాలోని అరకులో ఆదివాసుల పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు తన సొంత డబ్బును ఖర్చు చేశారు. దీంతోపాటు విరాళాలు కూడా సేకరించారు. అక్కడి ఆదివాసుల పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేక అవస్థలు పడడం చూశానని, దీంతో నిధిని సేకరించి ఆ ప్రాంతంలో పాఠశాలను కట్టించినట్లు కాజల్‌ ఓ సందర్భంలో తెలిపారు.

సమంత

మంత 2012 అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె రెండు నెలలపాటు షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. కొన్ని ప్రాజెక్టులను కూడా మిస్‌ అయ్యాయి. ఈ సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సహాయం చేయాలని సామ్‌ నిర్ణయించుకున్నారు. 2012లో ప్రత్యూష ఫౌండేషన్‌ పేరుతో ట్రస్ట్‌ను స్థాపించారు. వైద్యులైన తన స్నేహితుల సహాయంతో చిన్నారులకు, మహిళలకు చికిత్స అందిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలు, వాణిజ్య ప్రకటనలకు వచ్చే పారితోషికాన్ని ఆమె పూర్తిగా ఫౌండేషన్‌ కోసం ఖర్చు చేస్తుంటారు.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా 2006 నుంచి యూనిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్నారు. పిల్లల హక్కులు, చదువు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. 2010లో ఆమెను యూనిసెఫ్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. క్యాన్సర్‌ రోగుల వైద్యసేవలకు విరాళాలు సేకరించేందుకు కూడా ప్రియాంక పలు షోలలో పాల్గొన్నారు. ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో క్యాన్సర్‌ రోగుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసేందుకు ఆమె రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ వార్డుకు ఆమె తండ్రి అశోక్‌ పేరుపెట్టారు.

హన్సిక

న్సిక 25 మంది పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 10 మంది మహిళల వైద్య ఖర్చుల్ని భరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్న ‘చెన్నై టర్న్స్‌ పింక్‌’ సంస్థకు ప్రచారకర్తగా ఉన్నారు.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్‌ తన తండ్రి కమల్‌ హాసన్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేస్తున్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. వారి వైద్య, విద్య ఖర్చుల్ని కూడా ఈ సంస్థే భరిస్తోంది.

దీపికా పదుకొణె

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంటారు. తన స్టేజ్‌ షోల ద్వారా వచ్చిన మొత్తాన్ని వాటికి ఇస్తుంటారు. అంతేకాదు వివిధ కార్యక్రమాల ద్వారా విరాళాల్ని కూడా సేకరిస్తుంటారు. 2010లో మహారాష్ట్రలోని అంబేగావ్‌ గ్రామాన్ని దత్తత తీసుకుని, అక్కడ అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడానికి తోడ్పడుతున్నారు. ఒకప్పుడు డిప్రెషన్‌తో బాధపడ్డానని, దాన్నుంచి కోలుకోవడానికి చాలా కష్టపడ్డానని దీపిక పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మానసిక రుగ్మతలపై అవగాహన కల్పించేందుకు ‘లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. దీని ద్వారా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయిస్తున్నారు.

సోనమ్‌ కపూర్‌

సోనమ్‌ కపూర్‌ తన ఫ్యాషన్‌ అభిరుచిని సమాజానికి ఉపయోగపడేలా చేస్తున్నారు. ఆమె ప్రముఖ డిజైనర్‌ పెర్నియా ఖురేషీతో అసోసియేట్‌ అయ్యారు. తన దుస్తుల్ని విరాళంగా ఇస్తుంటారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ‘స్మైల్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తుంటారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న పేద పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తోంది.

సన్నీ లియోని

న్నీ లియోని ముంబయిలోని ఓ పాఠశాలలోని పిల్లల అభివృద్ధి కోసం పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తుంటారు. ఆమె ఓ వృద్ధురాల్ని, మరో వృద్ధ దంపతుల్ని దత్తత తీసుకున్నారు. క్యాన్సర్ రోగుల వైద్యం కోసం కూడా ఆర్థిక సహాయం చేశారు.

జాక్వెలిన్‌

బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ పలు స్వచ్ఛంద సంస్థల కోసం సహాయం చేస్తున్నారు. జంతువుల సంరక్షణ కోసం కూడా పాటుపడుతున్నారు. 2014లో ‘పెటా’ ఆమెను ‘వుమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ టైటిల్‌తో సత్కరించింది. అంతేకాదు తమిళనాడును వరదలు ముంచెత్తినప్పుడు చాలా మంది నివాసాలు కోల్పోయారు. వారికి కొత్తగా ఇళ్లు కట్టించేందుకు జాక్వెలిన్‌ పెద్ద మొత్తం విరాళంగా ఇవ్వడంతోపాటు ఇతరుల నుంచి విరాళాలు సేకరించారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.