close

తాజా వార్తలు

వామ్మో.. ఈయన అమితాబ్‌ బచ్చనా..!

ముంబయి: పై ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుడిని గుర్తుపట్టారా? ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. దర్శకుడు శూజిత్‌ సర్కార్‌ తెరకెక్కిస్తున్న ‘గులాబో సితాబో’ సినిమాలో అమితాబ్‌ గెటప్‌ ఇది. ఈ లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసి బిగ్‌బి అభిమానుల్ని షాక్‌కు గురయ్యేలా చేసింది. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేశారు.

ఈ మేకప్‌ వేయించుకోవడానికి తాను చాలా అలసిపోయేవాడినని అమితాబ్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో అమితాబ్‌ లఖ్‌నవూకు చెందిన ఓ కోపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇందులో అమితాబ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో ముందుగానే శూజిత్‌ పేపర్‌పై బొమ్మ గీసి బిగ్‌బికి చూపించారట. ఈ బొమ్మ చూడగానే అమితాబ్‌ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నారు. ఫ్యామిలీ డ్రామా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.