close

తాజా వార్తలు

అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యంపై దిల్లీకి యడ్డీ!

రేపే సుప్రీం విచారణ

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన 17 మంది అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప దిల్లీకి వెళ్లనున్నారు. అక్టోబరు 21న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆ నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అనర్హత వేటును సవాలు చేస్తూ వీరంతా సుప్రీం మెట్లెక్కిన విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వానికి ఏర్పాటుకు కారణమైన ఈ ఎమ్మెల్యేలపై కృతజ్ఞతగా యడ్డీ దిల్లీకి పయనమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి పరిస్థితిపై అధిష్ఠానానికి వివరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

 అత్తెసరు మెజార్టీతో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం వీరితో చాలానే అవసరం ఉంది. సర్కారు కొనసాగాలంటే అత్యధిక మెజార్టీ అవసరం. ఈ నేపథ్యంలో యడ్డీ దిల్లీ వెళ్లనున్నారు.
అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసు సోమవారం సుప్రీంలో విచారణకు రానుంది. సుప్రీం తీర్పుపై నేతలందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పోటీచేయాలన్న యోచనలో ఉన్నారు.  అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయం మాత్రం తెలియరాలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో 9 రోజులే గడువు ఉండటంతో యడ్డీ కూడా వీరిపై దృష్టి సారించారు.

ఈ ఉప ఎన్నికలకు సంబంధించి సెప్టెంబరు 23న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఆ రోజు నుంచి సెప్టెంబరు 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబరు 1 నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉప సంహరణకు అక్టోబరు 3 చివరి తేది. 21న పోలింగ్‌ నిర్వహించి 24న ఫలితాలను ప్రకటిస్తారు.
 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.