
తాజా వార్తలు
‘‘తమిళం, తెలుగు భాషలు వేరైనా సినిమా ఎక్కడైనా ఒకటే’’ అంది కేథరిన్ థెరిసా. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నాయిక ఈమె. సిద్ధార్థ్ హీరోగా, సాయి శేఖర్ తెరకెక్కించిన ‘వదలడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా విలేకర్లతో కేథరిన్ చెప్పిన విషయాలివీ...
* ‘‘ఈ చిత్రంలో జ్యోతి అనే టీచర్‌గా కనిపిస్తా. తను వాసనను గుర్తించలేదు. సామాజిక సందేశం ఉన్న చిత్రమిది. ఆహార కల్తీ అనర్థాల గురించి చెప్పబోతున్నాం. యాక్షన్ అంశాలూ ఉంటాయి. సిద్ధార్థ్ ఆహార భద్రత అధికారిగా కనిపిస్తారు. సిద్ధార్థ్ తరచూ సమాజంలోని సమస్యలపై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తుంటారు. నేనూ అలా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. నటనపరంగా సిద్ధార్థ్ సలహాలు ఇస్తుంటారు. తమన్ ఇచ్చిన సంగీతం చాలా బాగుంది’’.
* ‘‘నేను నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే ఎంచుకుంటున్నా. ‘సరైనోడు’లో నేను చేసిన ఎమ్మెల్యే పాత్రకు ఎంతో పేరొచ్చింది. కొత్తదనం నిండిన కథలు దొరికితే ఏ భాషలోనైనా ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధం. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడమంటే నాకు అసలు నచ్చదు. ప్రస్తుతం నేను తెలుగులో విజయ్ దేవరకొండతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నటిస్తున్నా’’.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
