close

తాజా వార్తలు

మీరైతే ఏం చేస్తారు?

చదువు, ఉద్యోగాల పేరుతో ఆడపిల్లలు ఎక్కువ సమయం బయట గడుపుతోన్న రోజులివి. ఈ పరిస్థితుల్లో ఆకతాయిల వేధింపులూ మామూలే. ఓ ఆడపిల్లగా వాటిని మీరు ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారనే ప్రశ్నకు పాఠకుల నుంచి వచ్చిన స్పందనలేంటో చూద్దాం.
* ఈ కాలంలో చాలామంది అమ్మాయిలు బయట ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి వారికి ఎక్కడో ఓచోట వేధింపులు ఎదురవుతూనే ఉంటాయి.  అలాంటి పరిస్థితిని సులువుగా ఎదుర్కోవాలంటే అవతలివారి ప్రవర్తనను బట్టి వారితో ఎంత వరకు ఉండాలనేది నిర్ణయించుకోవాలి. ఎంత చనువుగా మాట్లాడుతున్నా... పరిధి గీసుకోవాలి. నేను అదే చేస్తా.

- సుధారాణి, కడప

* భయం వదిలేస్తే చాలా సమస్యలు తగ్గుతాయనేది నా అభిప్రాయం. ఓసారి బండిమీద వెళ్తోంటే... ఓ ఆకతాయి నన్ను వెంబడించాడు. ఒక్క క్షణం కంగారు పడినా... తరువాత పోలీసు హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి సమాచారం అందించా. వాళ్లు వెంటనే స్పందించడంతో నా సమస్య పరిష్కారమైంది.

- శ్రీవాణి, హైదరాబాద్‌

* బయటకు వెళ్లేముందు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటా. ఆకతాయిల కారణంగా ఇబ్బందులు ఎదురైతే స్నేహితులకు ఫోన్‌ చేస్తా. అవసరమైతే తిరగబడేందుకు సిద్ధంగా ఉంటా.

- సత్యశ్రీ, విశాఖపట్టణం

* మహిళలు, యువతులు ఆకతాయిల ఆగడాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా నేను కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉంటా. మనం అలా ఉన్నామని తెలిసినప్పుడు అవతలివారు కచ్చితంగా తగ్గుతారు. మానసిక స్థైర్యం అలవరచుకుంటే ఎలాంటి పరిస్థితుల్ని అయినా ఎదుర్కోవచ్చు.

- కావ్య, ఖమ్మం

* ఓసారి బస్సులో వెళ్తున్నప్పుడు ఇద్దరబ్బాయిలు  వేధించారు. ఒక వ్యక్తి చెంపమీద కొట్టా. తోటి ప్రయాణికులంతా వారికి బుద్ధిచెప్పారు. వారంతా మా ఇంటికి గొడవకు వచ్చారు. మా నాన్న హెచ్చరించి పంపేశారు. మహిళలు ధైర్యంగా ఉంటేనే ఇలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు.

- ఆదిలక్ష్మి, విశాఖపట్టణం

* బయటకు వెళ్లినప్పుడు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఓ కంట కనిపెడుతుంటా. తెలియని వారితో మాట్లాడను. అనుకోని పరిస్థితులు ఎదురైతే ఆత్మరక్షణ పద్ధతులు పాటించేందుకు మానసికంగా సిద్ధంగా ఉంటా. పోలీసుల హెల్ప్‌లైన్‌ నంబరు, స్నేహితుల ఫోను నంబర్లను స్పీడ్‌ డయల్‌లో పెట్టుకుంటా. అత్యవసరమైతే వారి సాయం అడుగుతా.

- సౌజన్య కర్ణాటి, గుంటూరు



అందరివీ ఇక్కడ ఇవ్వలేం కాబట్టి... మిగిలినవి eenadu.netలో చూడగలరు.

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా జంక్‌ఫుడ్‌నే కోరుకుంటున్నారు. అలాంటివారికి పోషకాహారం అలవాటు చేయడం చాలా కష్టం. ఓ తల్లిగా మీరు మీ పిల్లల విషయంలో పోషకాహారం తినిపించేందుకు ఏం చేస్తున్నారో మాకు వాట్సాప్‌ చేయండి.
వసుంధర డెస్క్‌ ఫోన్‌: 9154091911


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.