close

తాజా వార్తలు

‘బిగ్‌బాస్‌’ను బ్యాన్‌ చేయండి!

ముంబయి: గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న బాలీవుడ్‌ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. సల్మాన్‌ఖాన్‌ వ్యాఖ్యాతగా ఇటీవల ‘బిగ్‌బాస్‌ 13వ సీజన్‌’ ప్రారంభమైంది. అయితే ఈ షోను వెంటనే బ్యాన్‌ చేయాలని రాజస్థాన్‌కు చెందిన కర్ణిసేన డిమాండ్‌ చేస్తోంది. ‘బిగ్‌బాస్‌’ షో భారతీయ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని,  దాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కర్ణిసేన సంస్థకు చెందిన ప్రతినిధులు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు ఓ లేఖను రాశారు. జాతీయ మీడియా వేదికగా హిందూ సంప్రదాయాలను అవహేళన చేస్తున్నారని వారు ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ రియాల్టీ షో ద్వారా జిహాద్‌ని ప్రమోట్‌ చేస్తున్నట్లు ఉందని వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ రియాల్టీ షో కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా లేదని, చాలా అసభ్యకరంగా ఉందని వారు లేఖలో వివరించారు. మరోవైపు, కర్ణిసేన సంస్థ ప్రతినిధులు ఈ రియాల్టీ షోను బ్యాన్‌ చేయాలని కోరుతూ మహారాష్ర్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు కూడా లేఖ రాశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.