close

తాజా వార్తలు

బాక్సర్‌గా వరుణ్‌తేజ్‌

హైదరాబాద్‌: మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌తేజ్‌. తాజాగా ఆయన 10వ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అల్లుఅరవింద్‌ సమర్పణలో కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబర్‌ నుంచి ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ జరగనుంది.

తమిళ సినిమా ‘జిగర్తాండా’కు రీమేక్‌గా తెలుగులో విడుదలైన సినిమా ‘గద్దలకొండ గణేష్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్‌ కథానాయకుడు. పూజాహెగ్డే కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.