close

తాజా వార్తలు

విక్రమ్‌ సరసన ‘కేజీఎఫ్‌’ తార

చెన్నై: ‘కేజీఎఫ్‌’ చిత్రంలో నటించి కన్నడ సినీ పరిశ్రమకు కథానాయికగా పరిచయమైన నటి శ్రీనిధి శెట్టి. తాజాగా ఆమె కోలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. విక్రమ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాకి ఆమె సంతకం చేశారు. అజయ్‌ జ్ఞానముత్తు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు ఆమె ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాపై చర్చలు జరుగుతున్నాయి. అజయ్‌ జ్ఞానముత్తు సినిమాలకు నేను అభిమానిని. ఆయన దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి సంతకం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా కోసం నేను చాలా ఉత్సాహాంగా ఎదురు చూస్తున్నాను’ అని తెలిపారు.

మరోవైపు శ్రీనిధిని కథానాయికగా ఎన్నుకోవడంపై అజయ్‌ జ్ఞానముత్తు స్పందించారు. ‘విక్రమ్ చాలా మంది కథానాయికలతో కలిసి నటించారు. అయితే నేను దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో ఆయన సరసన కొత్త కథానాయిక ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఆ క్రమంలో సోషల్‌మీడియాలో శ్రీనిధి వీడియోలను చూసి ఆమెను సంప్రదించాం. ‘కేజీఎఫ్‌’ చిత్రంలో శ్రీనిధి పోషించిన పాత్రకు, ఈ సినిమాలో ఆమె నటించబోయే పాత్రకు ఎటువంటి సంబంధం లేదు’ అని అజయ్‌ వివరించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.