close

తాజా వార్తలు

పంచెకట్టులో రాజమౌళి

హైదరాబాద్‌: ఎన్నో హిట్‌ చిత్రాలను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడూ చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. తాజాగా ఆయన విదేశాల్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణలో హాజరై అందర్నీ ఆకట్టుకున్నారు. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ ప్రదర్శన శనివారం జరిగింది. చిత్ర ప్రదర్శన జరుగుతున్నంతసేపు చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి నేతృత్వంలో నేపథ్య సంగీత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ తారలు ప్రభాస్‌, రానా, అనుష్కలతోపాటు నిర్మాత శోభు యార్లగడ్డ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పంచెకట్టులో రాజమౌళి బాహుబలి బృందంతో సందడి చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

5200 మంది వీక్షించే సామర్థ్యం ఉన్న ఈ పురాతన హాల్‌లో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ‘బాహుబలి’ని వీక్షించేందుకు జపాన్‌ నుంచి లండన్‌ వచ్చిన కొందరు యువతులు రాజమౌళితో ఫొటోలు దిగారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.