close

తాజా వార్తలు

Published : 22/03/2019 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పినాకిన్‌ తోడుగా

దిక్సూచి

దక్షిణాదిలో అరుదైన ప్రదేశాలతో అలరిస్తున్న రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక. ఈ రాష్ట్రాల్లోని హంపి, బాదామి, మైసూరు, శ్రీరంగం, మహాబలిపురం, కంచి వంటి ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలు విహార ప్రియులకు ఆనందాన్నిచ్చేవే! ఈ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? వాటి గురించి మరింత తెలుసుకోవాలని భావిస్తున్నారా? అయితే చరవాణిలో పినాకిన్‌ (Pinakin) అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. తమిళనాడు, కర్ణాటకల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల విశేషాలన్నీ ఇందులో చూడొచ్చు. వాటి విశేషాలను, చరిత్రను వినొచ్చు. తమిళం, కన్నడం, ఇంగ్లిష్‌తో పాటు హిందీ, ఫ్రెంచ్‌ భాషల్లోనూ ఆడియో వినొచ్చు. ఒక్కో ప్రదేశానికి చెందిన ఆడియో కథనం వినాలంటే రూ.30 చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లోనూ ఆడియో సేవలు పొందొచ్చు. పర్యాటక కేంద్రాల్లో పార్కింగ్‌ ప్రదేశాలు, టికెట్‌ ధర వివరాలు కూడా తెలుసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని