
తాజా వార్తలు
వారాంతంలో..
మంద్రంగా తాకే కాఫీ పరిమళాలు...అందంగా తలలూపే మహావృక్షాలు...అక్కడక్కడా మేమున్నామనే సూర్యకిరణాలు.. కుదిరితే ఓ కప్పు కాఫీ తాగుతూ అలా అలా అనంతగిరుల్లో తిరుగుతుంటే ఆ అనుభూతే వేరప్పా..!
ఒకప్పుడు వేసవి విడుదులంటే ఊటీ, కొడైకెనాల్, డార్జిలింగ్... కానీ గత దశాబ్దకాలంలో మన మన్యం ప్రాంతం కూడా పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అరకు నుంచో, విశాఖ నుంచో ఒక్కరోజులో చుట్టివచ్చేందుకు అనువైన చక్కటి పర్యటక స్థలం అనంతగిరి కొండలు. ఇక్కడ దట్టమైన అడవులు, కొండలు, కోనలతో పాటు పెద్దఎత్తున సాగు చేస్తున్న కాఫీ తోటలు మరో ఆకర్షణ. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతం తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అతి తక్కువ ప్రదేశాల్లో ఒకటి.
కాకులు దూరని కాఫీ తోటలు...
ఇక్కడి ఎత్తయిన చెట్ల కింద ప్రధానంగా కాఫీ సాగు 1960 నుంచే ప్రారంభమైంది. సూర్య కిరణాలు నేరుగా నేలపై పడకుండా కాపాడుతూ చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచే కాఫీ తోటలు ఇక్కడ విస్తారంగా ఉన్నాయి. గాలిలో సాంద్రత కారణంగా ఇక్కడ పొగమంచు నేరుగా నేలను తాకకుండా మధ్యలో ఉన్న చెట్ల ఆకులపై పడుతుంది. దీనివల్ల చల్లదనం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనల్లో గుర్తించారు. ఆర్వీ నగర్, మినుములూరు, పెదబయలు, అనంతగిరి కాఫీ ఎస్టేట్ పరిధుల్లో ఉన్న లంబసింగి, చుట్టుమెట్ట, బీస్పురం, మోదకొండమ్మ పాదాల దగ్గర ప్రకృతి సౌందర్యంతో పాటు ప్రశాంత వాతావరణాన్నీ ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా 1.50 లక్షల ఎకరాల్లో విస్తరించిన కాఫీ తోటలు, మిరియాల తోటలు, వీటికి నీడనిచ్చే సీల్వర్ ఓక్ చెట్లతో పర్యాటకులు మధురానుభూతులు సొంతం చేసుకోవడం ఖాయం.
ఇలా చేయండి..
కట్టిపడేసే ప్రకృతి అందాలు, అద్భుతమైన వాతావరణం ఉన్నా అక్కడ సౌకర్యాలు అంతంత మాత్రమే! కాబట్టి పర్యటకులు ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేలా ప్రణాళిక వేసుకుంటే మంచిది. విశాఖ నుంచో, అరకు నుంచో వాహనంలో ఈ ప్రాంతాన్ని చుట్టేయొచ్చు. లంబసింగిలో ఆంధ్రప్రదేశ్ పర్యటకశాఖ రూ.8 కోట్ల వ్యయంతో రిసార్ట్స్‌ను నిర్మిస్తోంది. ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
