close

తాజా వార్తలు

ఆలిపై కోపంతో..నాలుక తెగ్గోసుకున్నాడు!

అమ్రాబాద్‌: నాలుక తెగిన స్థితిలో వైద్యశాలకొచ్చిన ఈ యువకుడి పేరు చిగుర్ల చంద్రయ్య. ఊరు నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లి. భార్య లింగమ్మతో మంగళవారం గొడవపడి, ఆ రాత్రంతా ఆగ్రహంతో రగిలిపోయి, బుధవారం ఉదయం కత్తితో నాలుక కోసేసుకున్నాడు. నోటి నుంచి రక్తం కారడం చూసిన తల్లి ముత్తమ్మ ఆరా తీస్తే, తెగిన నాలుక భాగాన్ని తీసి ఆమె చేతిలో పెట్టాడు! వెంటనే అచ్చంపేటకు, అక్కడినుంచి జిల్లాకేంద్ర ఆస్పత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు  తరలించారు. అప్పటికే ఆలస్యమవడంతో, నాలుకను తిరిగి అతికించే అవకాశమే లేదని డాక్టర్లు తేల్చిచెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.