close

తాజా వార్తలు

మెరుపుదాడిలో 300 మంది హతం?

దిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాలపై భారత్‌ భీకరదాడికి పాల్పడింది. నియంత్రణ రేఖను దాటి బాలాకోట్‌, ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. మిరాజ్‌-2000 యుద్ధ విమానాల ద్వారా దాదాపు వెయ్యి కిలోల బరువున్న బాంబులతో ఈ దాడి చేపట్టింది. కాగా.. ఈ ఘటనలో దాదాపు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్ర శిబిరాల్లో బాలాకోట్‌ శిబిరం చాలా పెద్దది. దాదాపు 6 నుంచి 7 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ దాడి జరిగిందంటే మృతుల సంఖ్యే ఎక్కువే ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. దాడిపై భారత ప్రభుత్వం ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఈ వార్తలను తిప్పికొడుతోంది. పాక్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన భారత యుద్ధ విమానాలను తాము సమర్థంగా తిప్పికొట్టామని ఆ దేశ ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అసిఫ్‌ గఫూర్‌ తెలిపారు. తమ వైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.