Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 107710
            [news_title_telugu_html] => 

భారత ఆర్మీ మరో ఆపరేషన్‌

[news_title_telugu] => భారత ఆర్మీ మరో ఆపరేషన్‌ [news_title_english] => Targeted action against 10 top terrorists in JK soon [news_short_description] => హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అగ్ర కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ నైకూ సహా జమ్ముకశ్మీర్‌లో ఉంటోన్న 10 మంది మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాను భద్రతా ఏజెన్సీలు సిద్ధం చేసుకున్నాయి.   [news_tags_keywords] => terrorists,army,Hizbul Mujahideen [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-04 19:30:36 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భారత ఆర్మీ మరో ఆపరేషన్‌ - Targeted action against 10 top terrorists in JK soon - EENADU
close

తాజా వార్తలు

భారత ఆర్మీ మరో ఆపరేషన్‌

టాప్‌ 10 ఉగ్రవాదుల జాబితా సిద్ధం

చిక్కితే పట్టుకుంటారు.. లేకపోతే కాల్చిపారేస్తారట

న్యూదిల్లీ: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అగ్ర కమాండర్‌ రియాజ్‌ అహ్మద్‌ నైకూ సహా జమ్ముకశ్మీర్‌లో ఉంటోన్న 10 మంది మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాను భద్రతా ఏజెన్సీలు సిద్ధం చేసుకున్నాయి. వారిని హతమార్చేందుకు లేదా అదుపులోకి తీసుకొనేందుకు త్వరలోనే బలగాలు ఆపరేషన్‌ ప్రారంభించనున్నాయి. నిఘా సంస్థలు, పారామిలిటరీ బలగాలు, ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ 10 మంది ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశారు. వీరంతా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తూ పలు జిల్లాలకు కమాండర్‌లుగా వ్యవహరిస్తున్నారు. కశ్మీరు లోయలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అగ్ర కమాండర్‌గా ఉంటోన్న‌  నైకూ.. ఈ ప్రాంతంలో ఘర్షణపూరిత చర్యలను ప్రోత్సహిస్తున్నాడు. అతడి చర్యలకు భద్రతా బలగాలతో పాటు పౌరులు బాధితులవుతున్నారు. 

భద్రతా ఏజెన్సీలు సిద్ధం చేసిన టాప్‌-10 ఉగ్రవాదుల జాబితాలో లష్కర్‌ ఎ తోయిబా షోపియాన్‌ జిల్లా కమాండర్‌ వసీమ్‌ అహ్మద్‌ అలియాస్‌ ఒసామా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అనంతనాగ్ జిల్లా‌ కమాండర్ అష్రఫ్‌ ఖాన్‌, బారాముల్లా జిల్లా కమాండర్‌ మెహ్రాజ్‌ ఉద్‌ దిన్‌, శ్రీనగర్‌ ఉగ్రవాద ఆపరేటర్‌ సైఫుల్లా మిర్‌ అలియాస్‌ డాక్టర్‌ సైఫ్‌, పుల్వామా జిల్లా కమాండర్‌ అర్షైద్‌ ఉల్‌ హక్‌ ఉన్నారు. వీరితో పాటు కశ్మీర్‌లోయలో జైష్‌ ఎ మహ్మద్‌ చీఫ్‌ ఆపరేషనల్‌ కమాండర్, పాక్‌కు చెందిన‌ హఫీజ్‌ ఉమర్‌, ఉత్తర కశ్మీర్‌ విభాగ కమాండర్‌ అల్‌ బద్ర్‌ జావెడ్‌ మట్టూ, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది అజాజ్‌ అహ్మద్‌ మాలిక్‌, జేఈఎం ఉగ్రవాది జాహిద్‌ షైక్‌ ఉమీర్‌ ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఉగ్రవాదులే లక్ష్యంగా త్వరలోనే ఆపరేషన్‌ మొదలవుతుందని అధికారులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.