close

తాజా వార్తలు

గుప్తనిధుల కోసం ముగ్గురి హత్య!

తనకల్లు: అనంతపురం జిల్లాలో ముగ్గురి హత్య తీవ్ర కలకలం రేపింది.తనకల్లు మండలం కొర్తికోటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కొర్తికోట శివాలయం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని హనుమమ్మ, సత్యలక్ష్మి, శివరామిరెడ్డిగా గుర్తించారు. గుప్త నిధుల కోసమే ఈ ముగ్గురినీ చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.