close

తాజా వార్తలు

ఎయిరిండియాకు ఇంధనం నిలిపివేత

న్యూదిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు చెందిన విమానాలకు దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి. బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. దీనివల్ల విమాన కార్యకలాపాలకు ఎలాంటి అవరోధమూ కలగలేదని వివరించారు. కోచి, విశాఖ, మోహాలీ, రాంచీ, పుణె, పట్నా విమానాశ్రయాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ఇంధన సరఫరాను నిలిపివేశాయి. దీనిపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ.. ఆయిల్‌ కంపెనీలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.