
తాజా వార్తలు
కోల్కతా: అన్నీ ఉన్నా తరచూ సాకులు చెప్తుండేవారికి ఈ బాలిక డాన్స్ వీడియో ఒక స్ఫూర్తి పాఠం లాంటిది. కోల్కతాకు చెందిన 11 ఏళ్ల బాలిక అంజలి మెడికల్ సదస్సులో వేదికపై నృత్యం చేసి ఔరా అనిపించింది. ఇందులో గొప్పతనమేమిటి అనుకుంటున్నారా? వేదికపై అందరి ముందు అంజలి ఒకే కాలుతో డాన్స్ చేసింది. ఎందుకంటే క్యాన్సర్ మహమ్మారి వల్ల ఆమె తన ఎడమ కాలిని కోల్పోవాల్సి వచ్చింది.
కొన్ని రోజుల క్రితం కోల్కతాలో మెడికల్ సదస్సు ఒకటి జరిగింది. ఈ సదస్సుకు వందలాది మంది హాజరయ్యారు. ఆడిటోరియంలో భారీ వేదికపై హిందీ చిత్రం అంజలి భూల్ భూలైయా (చంద్రముఖి) చిత్రంలోని మేరే ఢోల్నా సన్.. (వారాయ్..) పాటకు నృత్యం చేసింది. ఒకే కాలుతో ఏ మాత్రం పట్టు కోల్పోకుండా అంజలి సంప్రదాయ నృత్యం చేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆమె నృత్యం చేసిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్గా మారింది.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
