close

తాజా వార్తలు

హోండా షోరూంలో భారీ అగ్నిప్రమాదం

మలక్‌పేట‌: హైదరాబాద్‌ మలక్‌పేట ఆది హోండా షోరూంలోని రెండో అంతస్తులో శుక్రవారం అర్ధరాత్రి అకస్మత్తుగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన వాచ్‌మెన్‌ అప్రమత్తమై యాజమాన్యానికి సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 50 ద్విచక్రవాహనాలు, కంప్యూటర్లు, సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయని యాజమాన్యం తెలిపింది. సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెద్ద నష్టం తప్పిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.