close

తాజా వార్తలు

శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడి..10మందికి గాయాలు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్‌లో గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్‌ రోడ్డు ప్రాంతంలోని ఓ మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఇప్పటికే భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారం రోజుల క్రితం సొపోర్‌లోని ఓ బస్‌స్టాండ్‌లో ఉగ్రవాదుల జరిపిన గ్రనేడ్‌ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డ విషయం తెలిసిందే. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.