
తాజా వార్తలు
పాతకక్షలే కారణం
11 మంది అరెస్టు
హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు
కేసీ క్యాంపు, (హుజూరాబాద్ గ్రామీణం), న్యూస్‌టుడే: పాతకక్షలతోనే పథకం ప్రకారం మహిళను హత్య చేసినట్లు హుజూరాబాద్ ఏసీపీ సుందరగిరి శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం హుజూరాబాద్ మండలం కేసీ క్యాంపులోని ఏసీపీ కార్యాలయంలో పట్టణ సీఐ వాసంశెట్టి మాధవితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ మండలం రంగాపూర్‌కు చెందిన బండ సమ్మక్క(45) అనే మహిళ ఈ నెల 14న హత్యకు గురైనట్లు చెప్పారు. బండ సమ్మక్క, బొడ్డు శ్రీనివాస్ రెండు కుటుంబాల మధ్య గత సంవత్సరన్నర కాలం నుంచి పాతకక్ష్యలున్నట్లు తెలిపారు. ఈ నెల 13న రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి బొడ్డు శ్రీనివాస్ కుటుంబీకులు సమ్మక్కను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. 14న గురువారం ఉదయం సమ్మక్క తన పనుల నిమిత్తం గ్రామంలోకి వెళ్తుండగా శ్రీనివాస్ వెంబడించినట్లు వివరించారు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో సమ్మక్క సీసీ రోడ్డుపై పడిపోయినట్లు చెప్పారు. సమీపంలోని బండరాయితో ఆమె ఛాతీపై కొట్టడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై 16 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. విచారణలో భాగంగా హత్యకేసుతో సంబంధం ఉన్న నిందితులు జమ్మికుంటలో ఓ అద్దె ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందినట్లు చెప్పారు. బొడ్డు శ్రీనివాస్, బొడ్డు లత, బొడ్డు సమ్మయ్య, బొడ్డు సరోజన, బొడ్డు ఆంజనేయులు, బొడ్డు అజయ్, బొడ్డు ప్రవళిక, బొడ్డు మొగిలి, బొడ్డు కిషన్, బొడ్డు విజయ, బొడ్డు స్వరూపలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పాతకక్ష్యల నేపథ్యంలో రెండు కుటుంబాలకు చెందిన పలువురిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా పలువురిపై హిస్టరీషీట్లను తెరువనున్నట్లు స్పష్టంచేశారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ మాధవి, ఎస్సై చీనానాయక్లను అభినందించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- గాంధీ ఆస్పత్రికి దిశ నిందితుల మృతదేహాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
