
తాజా వార్తలు
జైపూర్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బికనేర్ జిల్లా శ్రీ దంగర్‌గఢ్ సమీపంలోని 11వ నెంబర్ జాతీయరహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా బస్సులో మంటలు అంటుకొని కొంతమంది ప్రయాణికులు అందులోనే చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బికనేర్ జిల్లాలో గత 24 గంటల్లో ఇది రెండో రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం. ఆదివారం వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు పక్కన కూర్చున్న వారిపై నుంచి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు మృతిచెందారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
