
తాజా వార్తలు
విజయ్ శంకర్ మ్యాజిక్
నాగ్‌పుర్: భారత క్రికెట్ జట్టు 500వ వన్డే గెలుపును చిరస్మరణీయం చేసుకుంది. రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠ ఊపేసిన వేళ యువ ఆటగాడు విజయ్ శంకర్ మ్యాజిక్ చేశాడు. కంగారూలు చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా చివరి రెండు వికెట్లు తీశాడు. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. విరాట్ కోహ్లీ (116; 120 బంతుల్లో 10×4) కెరీర్లో 40వ శతకం అందుకున్నాడు. విజయ్ శంకర్ (46; 41 బంతుల్లో 5×4, 1×6) రాణించడంతో అంతకు ముందు భారత్ 250 పరుగులు చేసింది.
స్టాయినిస్ పోరాటం వృథా
ఆస్ట్రేలియా ఛేదనను ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (37; 53 బంతుల్లో 5×4, 1×6), ఉస్మాన్ ఖవాజా (38; 37 బంతుల్లో 6×4) ఘనంగా ఆరంభించారు. 83 పరుగుల భాగస్వామ్యం అందించారు. 14 ఓవర్ల వరకు టీమిండియాకు వికెట్ లభించలేదు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ ఫించ్‌ను, కేదార్ జాదవ్ ఖవాజాను జట్టు స్కోరు 83 వద్ద పెవిలియన్‌కు పంపించారు. షాన్ మార్ష్ (16), గ్లెన్ మాక్స్వెల్ (4) త్వరగానే ఔటైనా పీటర్ హాండ్స్‌కాంబ్ (48; 59 బంతుల్లో 4×4) రూపంలో ప్రతిఘటన ఎదురైంది. అలెక్స్ కారీ (22)తో కలిసి జట్టును నిలకడగా ముందుకు నడిపాడు. జట్టు స్కోరు 218 వద్ద కారీ ఔటయ్యాడు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్ స్టాయినిస్ (52; 65 బంతుల్లో 4×4, 1×6) తిరుగులేని అర్ధశతకం సాధించాడు. భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అయితే 46వ ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేశాడు. కౌల్టర్ నైల్ (4), కమిన్స్ (0)ను ఔట్ చేసి జట్టుకు ఊపిరినిచ్చాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 11 పరుగులు, టీమిండియాకు 2 వికెట్లు అవసరం అయ్యాయి. తొలి బంతికి స్టాయినిస్‌ను, మూడో బంతికి జంపాను ఔట్ చేసి విజయ్ శంకర్ భారత్‌కు అనూహ్య విజయం అందించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
