close

తాజా వార్తలు

దురదృష్టవశాత్తూ ఆ బంతులకు వికెట్లు పడవు

వార్నర్‌ వికెట్‌కి బెయిల్స్‌ పడకపోవడంపై కోహ్లీ

లండన్‌: దురదృష్టవశాత్తూ మంచి బంతులకు వికెట్లు పడవని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అన్నాడు. ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌వార్నర్‌ బౌల్డ్‌ విషయంపై స్పందించిన ఆయన ఆశ్చర్యంతో ఈ వ్యాఖ్యలు చేశాడు. 353 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసిస్‌కు బుమ్రా రెండో ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. తొలి బంతి ఎదుర్కొన్న డేవిడ్‌వార్నర్‌ డిఫెన్స్‌ ఆడబోయి ఆ బంతి వికెట్లకు కాస్త బలంగానే తగిలింది. అయితే వికెట్లపై నుంచి బెయిల్స్‌ పడకపోవడంతో వార్నర్‌ బతికిపోయాడు. అప్పటికీ అతడు ఒక్క పరుగే చేశాడు. 

మ్యాచ్ అనంతరం ఆసిస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందిస్తూ ఇలా జరగాల్సింది కాదని పేర్కొన్నాడు. కాగా టీమిండియా సారథి కోహ్లీ దీనిపై విచారం వ్యక్తం చేస్తూ అంతర్జాతీయస్థాయి మ్యాచ్‌లో ఇలాంటివి కచ్చితంగా ఊహించలేమని తెలిపాడు. ‘సాంకేతికంగా ఆ బెయిల్స్‌ ఎంతో ఉపయోగం. బంతి వికెట్లకు తగిలినప్పుడు లైట్స్‌ వస్తే మనకు తెలిసిపోతుంది. కానీ, అలా జరగాలంటే బంతి చాలా బలంగా వికెట్లకు తాకాలి. దురదృష్టమేంటంటే మంచి బంతులేసినప్పుడు వికెట్లు పడవు. ఇలా జరగాలని ఏ జట్టూ కోరుకోదు’ అని వాపోయాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.