close

తాజా వార్తలు

ధోనీ రిటైర్మెంట్‌ అడ్డుకున్న కోహ్లీ!

టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగాలని సూచన

ముంబయి: ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్థానం ముగియగానే ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌ వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చాయి. సెమీస్‌లో కోహ్లీసేన పరాజయం పాలవ్వగానే అతడి భవితవ్యంపై సందేహాలు మొదలయ్యాయి. మహీ ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉండటంతో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. జట్టులో అతడి పాత్ర ఏంటన్న దానిపై సెలక్టర్లు విశ్లేషించాలని మాజీలు సూచించారు. అసలు ఇంతకీ ఎంఎస్‌ మదిలో ఏముందో తెలుసుకోవాలని సెహ్వాగ్‌, గంభీర్‌ వంటి వారు నిక్కచ్చిగానే చెప్పేశారు.

ఆంతర్యం ఏంటీ?
ఇంతలోనే వెస్టిండీస్‌ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయాల్సిన సమయం వచ్చేసింది. సెలక్టర్లు ధోనీని ఎంపిక చేస్తారా? లేదా అన్న ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. ఐతే రెండు నెలలు టీమిండియాకు అందుబాటులో ఉండనని, పారామిటలరీలో ప్యారాచూట్‌ రెజిమెంట్‌లో సేవ చేస్తానని అతడు షాకిచ్చాడు. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత మొత్తం సైన్యానికే అంకితమవుతానని చెప్పిన ‘మిస్టర్‌ కూల్‌’ ఇలా విరామం తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఐతే...

కోహ్లీ కోరిక మేరకే!
ఇప్పుడిప్పుడే తెలుస్తున్న తాజా సమాచారం ఏంటంటే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ సూచన మేరకే ఎంఎస్‌ ధోనీ తన రిటైర్మెంట్‌ను వాయిదా వేసుకున్నాడట. 2020లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టుకు అందుబాటులో ఉండాలని విరాట్‌ కోరినట్టు సమాచారం. రిషభ్‌పంత్‌ తొలి ప్రాధాన్య కీపర్‌గా జట్టులో ఉంటాడు. అతడికి ఇబ్బందులు తలెత్తి విశ్రాంతి అవసరమైతే మరొక మంచి కీపర్‌ ఎవరూ ఉండరన్నది కోహ్లీ ఆలోచనగా తెలుస్తోంది. మహీ అయితే వెంటనే ఆ కొరత తీరుస్తాడని అతడి ఉద్దేశమట. పంత్‌ ఎదిగేందుకు అవసరమైన సాయం ధోనీ చేస్తాడని టీమిండియా యాజమాన్యమూ భావిస్తోందట. ఇంటర్నెట్‌లో ఇందుకు సంబంధించిన వార్తలు షికారు చేస్తున్నాయి.

‘ప్రపంచకప్‌ ఆడిన వెంటనే ఆటకు వీడ్కోలు పలుకొద్దని విరాట్‌ కోహ్లీ ధోనీని కోరాడు. ఆ తర్వాతే మహీ తన ఆలోచనను మార్చుకున్నాడు’ అని ఇంటర్నెట్లో వార్తలు వస్తున్నాయి. 

ఇదీ తర్కం!
‘ఎంఎస్‌ ధోనీకి ఫిట్‌నెస్‌ సమస్యల్లేవని విరాట్‌ భావిస్తున్నాడు. జట్టుకు అవసరమైతే టీ20 ప్రపంచకప్‌ వరకు అతడు కొనసాగుతాడని ఆశిస్తున్నాడు. పంత్‌ మెరుగైన వికెట్‌ కీపర్‌గా ఎదిగేందుకు ధోనీ సాయం అవసరమని టీమిండియా తర్కం. అప్పుడు మరో వికెట్‌ కీపర్‌ జట్టుకు అవసరం లేదని ఆలోచన. ఈ సమయంలో పంత్‌ గాయపడ్డా, ఫామ్‌ కోల్పోయినా ఎంఎస్‌ ధోనీ ఎలాంటి సమస్యల్లేకుండా ఆడగలడని కోహ్లీ భావిస్తున్నాడు’ అని విరాట్‌ సన్నిహిత వర్గాల సమాచారం. ఇది కేవలం విరాట్‌ యోచనా? సెలక్టర్ల ప్రమేయమూ ఉందా? తెలుసుకోవాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.