Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145076
            [news_title_telugu_html] => 

కపిల్‌ కన్నా వేగంగా  ఆ రికార్డు వేటలో జడ్డూ

[news_title_telugu] => కపిల్‌ కన్నా వేగంగా  ఆ రికార్డు వేటలో జడ్డూ [news_title_english] => Ravindra Jadeja eyes major landmark in India vs West Indies Tests [news_short_description] => టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. దిగ్గజ బౌలర్లు కపిల్‌దేవ్‌, మెక్‌గ్రాత్‌ కన్నా ముందుగానే ఆ ఘనతను సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు జడ్డూ సన్నద్ధం..... [news_tags_keywords] => Ravindra Jadeja ,kapil dev,ravi chandran ashwin,INDvsWI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-20 16:07:01 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కపిల్‌ కన్నా వేగంగా  ఆ రికార్డు వేటలో జడ్డూ - Ravindra Jadeja eyes major landmark in India vs West Indies Tests - EENADU
close

తాజా వార్తలు

కపిల్‌ కన్నా వేగంగా  ఆ రికార్డు వేటలో జడ్డూ

ముంబయి: టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. దిగ్గజ బౌలర్లు కపిల్‌దేవ్‌, మెక్‌గ్రాత్‌ కన్నా ముందుగానే ఆ ఘనతను సాధించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు జడ్డూ సన్నద్ధం అవుతున్నాడు. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు అవకాశం ఉందని తెలుస్తోంది. రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు ఖాయమే! ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌, జడ్డూ మధ్య పోటీ నెలకొంది. చాన్నాళ్లుగా చైనామన్‌ బౌలర్‌ ఫామ్‌లో లేకపోవడం జడ్డూకు కలిసొచ్చే అంశం. ఇప్పటి వరకు 41 టెస్టులు ఆడిన అతడు 192 వికెట్లు తీశాడు. 200కు ఇంకా 8 వికెట్ల దూరంలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో చోటు దక్కితే ఈ సౌరాష్ట్ర స్పిన్నర్‌ రికార్డు సృష్టించే అవకాశం ఉంది.

భారత్‌ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రికార్డు రవిచంద్రన్‌ అశ్విన్‌ పేరుతో ఉంది. అతడు 37 టెస్టుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. అరంగేట్రం చేసిన 4 ఏళ్ల 321 రోజుల్లోనే సాధించాడు. హర్భజన్‌ సింగ్‌ 46 టెస్టుల్లో ఈ రికార్డు అందుకున్నాడు. ఇందుకోసం అతడికి 7 ఏళ్ల 172 రోజులు పట్టింది. ఇక భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌దేవ్‌ 50వ టెస్టులో 200 వికెట్ల ఘనత సాధించడం గమనార్హం. ఏ రకంగా చూసినా భారత్‌ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్ల ఘనత సాధించే రెండో బౌలర్‌గా రవీంద్ర జడేజాకే అవకాశం ఉంది. ఆంటిగ్వా వేదికగా ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో కోహ్లీసేన తొలి టెస్టులో తలపడనుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.