Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145524
            [news_title_telugu_html] => 

100 వికెట్లు తీయడమే లక్ష్యం: శ్రీశాంత్

[news_title_telugu] => 100 వికెట్లు తీయడమే లక్ష్యం: శ్రీశాంత్ [news_title_english] => Aims to finish with 100 Test wickets Sreesanth [news_short_description] => టెస్టుల్లో వంద వికెట్లు తీయడమే అతని లక్ష్యమని భారత బౌలర్‌ కళంకిత శ్రీశాంత్ అన్నాడు. స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో భారత జట్టుకు దూరమైన శ్రీశాంత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. [news_tags_keywords] => Sreesanth,Virat Kohli,BCCI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 10:55:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
100 వికెట్లు తీయడమే లక్ష్యం: శ్రీశాంత్ - Aims to finish with 100 Test wickets Sreesanth - EENADU
close

తాజా వార్తలు

100 వికెట్లు తీయడమే లక్ష్యం: శ్రీశాంత్

దిల్లీ: టెస్టుల్లో వంద వికెట్లు తీయడమే తన లక్ష్యమని భారత బౌలర్‌ క్రికెటర్‌ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో జాతీయ జట్టుకు దూరమైన శ్రీశాంత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. జీవితకాల నిషేధానికి గురైన అతడికి బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ శిక్షను ఏడేళ్లకు కుదించారు. ఇప్పటికే ఆరేళ్ల పాటు నిషేధం పూర్తిచేసుకున్న అతడి శిక్ష 2020 ఆగస్టులో ముగుస్తుంది. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. ‘అంబుడ్స్‌మన్ నిర్ణయం ఎంతో సంతోషాన్నిచ్చింది. నా కోసం దేవుడిని ప్రార్థించిన శ్రేయోభిలాషులకి ధన్యవాదాలు. ఇప్పుడు నా వయసు 36. వచ్చే ఏడాదితో నా శిక్ష ముగుస్తుంది. అప్పటికీ నాకు 37 ఏళ్లు వస్తాయి. టెస్టుల్లో ఇప్పటి వరకు 87 వికెట్లు పడగొట్టాను. 100 వికెట్లు తీసి నా కెరీర్‌ను ముగించాలనేదే లక్ష్యం. టీమిండియాలో తిరిగి స్థానం దక్కించుకుంటాననే నమ్మకం ఉంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలో క్రికెట్‌ ఆడాలని ఉంది.’ అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. 

‘40 ఏళ్ల దగ్గరిలో ఉన్న శ్రీశాంత్ క్రికెట్‌ కెరీర్‌ ఇప్పటికే ముగిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అతడి శిక్ష కాలం ఏడేళ్లకి తగ్గించాం. 2013లో అతడు నిషేధానికి గురైన తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది’ అని జైన్‌ తెలిపారు. ఐపీఎల్‌లో ఒక ఓవర్లో ఉద్దేశపూర్వకంగా 14 పరుగులు ఇచ్చినందుకు రూ.10 లక్షలు తీసుకున్నాడని శ్రీశాంత్‌పై ఆరోపణ ఉంది. అవన్నీ తప్పుడు ఆరోపణలని అతడు మొదటి నుంచి వాదిస్తూ వస్తున్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యంవహిస్తూ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డందుకు శ్రీశాంత్‌తో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌లపై బీసీసీఐ 2013లో జీవితకాల నిషేధం విధించింది. భారత జట్టు తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. చివరిగా 2011లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.