close

తాజా వార్తలు

మ్యాచ్‌ ఫీజుని విరాళంగా ఇచ్చిన సంజుశాంసన్‌

దిల్లీ: కేరళ కుర్రాడు సంజు శాంసన్‌ తన మ్యాచ్‌ ఫీజును మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఆఖరి వన్డేలో సంజు చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. ‘మైదానం తడిగా ఉండి ఉంటే మ్యాచ్‌ను రద్దుచేసేవారు. ఈ మ్యాచ్‌ జరిగిందంటే దానికి కారణం సిబ్బంది. వారికి ధన్యవాదాలు. నా మ్యాచ్‌ ఫీజుని వారికి విరాళంగా ఇస్తున్నాను.’ అని అన్నాడు. వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి వన్డేను 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకపడ్డాడు. అతడికి తోడుగా టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (51) అర్ధశతకం చేయడంతో భారత్-ఎ 204 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-ఎ 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్-ఎ 4-1తో కైవసం చేసుకుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.